హోమ్ /వార్తలు /క్రీడలు /

MI vs KKR : ముంబైని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

MI vs KKR : ముంబైని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ (PC : IPL)

రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ (PC : IPL)

MI vs KKR : ఒత్తిడిలో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ సత్తా చాటింది.

MI vs KKR : ఒత్తిడిలో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ సత్తా చాటింది. డీవై పాటిల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై 52 పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని కేకేఆర్ విజయం సాధించింది. 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 17.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన ప్యాట్ కమన్స్ 3 వికెట్లతో మెరిశాడు. ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లతో అతడికి చక్కగా సహకరించాడు. ముంబై జట్టు తరఫున ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ లీగ్ లో ఐదో విజయాన్ని అందుకుంది. 12 మ్యాచ్ ల్లో 10 పాయింట్లు సాధించి లీగ్ టేబుల్ లో 7వ స్థానానికి చేరుకుంది.

ఇది కూడా చదవండి  : రోహిత్ శర్మ అవుటా.. నాటౌటా..! మరోసారి వివాదాస్పదమైన థర్డ్ అంపైర్ నిర్ణయం

ఛేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో దంచి కొట్టిన రోహిత్ శర్మ ఈసారి మాత్రం 2 పరుగులకే అవుటయ్యాడు. అయితే రోహిత్ అవుట్ నిర్ణయం వివాదాస్పదం అయ్యింది.  ఇక వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ (6)ను రస్సెల్ షార్ట్ పిచ్ బంతితో పెవిలియన్ కు చేర్చాడు. క్రీజులోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ ఫోర్లతో అలరించిన సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ (13) భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇక కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 15; 1 సిక్స్) మరోసారి టెస్టు మ్యాచ్ ను గుర్తు చేశాడు. కమిన్స్, రస్సెల్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు కేకేఆర్ ప్లేయర్ల సూపర్ ఫీల్డింగ్ కూడా తోడవ్వడంతో సమష్టి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన  కోల్ కతా నైట్ రైడర్స్  20 ఓవర్లలో  9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బుమ్రా తన చివరి రెండు ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోవడం విశేషం. కోల్ కతా బ్యాటర్స్ లో వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. మిస్టరీ స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ రెండు వికెట్లు సాధించాడు.

First published:

Tags: Andre Russell, IPL, IPL 2022, Jasprit Bumrah, Kolkata Knight Riders, Mumbai Indians, Pat cummins, Rohit sharma, Shreyas Iyer

ఉత్తమ కథలు