హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : మ్యాచ్ కు ముందే రూ. 8.25 కోట్ల‌ ముంబై హీరోకి ప్రత్యేక గిఫ్ట్.. ఆర్సీబీ కెప్టెన్ మాములోడు కాదు..!

IPL 2022 : మ్యాచ్ కు ముందే రూ. 8.25 కోట్ల‌ ముంబై హీరోకి ప్రత్యేక గిఫ్ట్.. ఆర్సీబీ కెప్టెన్ మాములోడు కాదు..!

RCB Skipper Faf Du Plesis

RCB Skipper Faf Du Plesis

IPL 2022 : లీగ్ దశ ఇంకా ముగియకున్నా.. శనివారం మ్యాచుతో ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఆరు టీమ్స్ ఇంటి ముఖం పట్టాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 లీగ్ స్టేజీ తుది ఘట్టానికి చేరుకుంది. ఇక లీగ్ దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (మే 22)న సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ (SRH vs PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే. ఎవరు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక లీగ్ దశ ముగియకున్నా.. శనివారం మ్యాచుతో ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఆరు టీమ్స్ ఇంటి ముఖం పట్టాయి. ఈసారి కొత్తగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఇక, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్‌ ఫోర్‌కు చేరేలా చేసింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians).

ఇక, ముంబై విజయంలో హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. అయితే డేవిడ్ కు ఆర్సీబీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఓ అపురూప కానుక పంపాడు. తనతో పాటు విరాట్‌, మ్యాక్స్‌వెల్‌లు ముంబై కిట్‌లో ఉన్న ఫోటోను డుప్లెసిస్‌ టిమ్‌కు మెసేజ్‌ చేశాడు. ఈ విషయాన్ని టిమ్‌ స్వయంగా వెల్లడించాడు. సదరు ఫోటోను త్వరలోనే తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తానని టిమ్‌ చెప్పుకొచ్చాడు.

అయితే, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో టిమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తును కన్ఫర్మ్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు.

మ్యాచ్‌ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫ‌ల్యంతో ఢిల్లీ ఓట‌మిపాలవగా, ఆర్సీబీ దర్జాగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కాగా, సింగపూర్‌కు చెందిన టిమ్‌ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో 8.25 కోట్ల‌కు కొనుగులు చేసింది.

టిమ్ డేవిడ్ అదృష్టవంతుడు

టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే వరకు కూడా మ్యాచ్ లో ఢిల్లీ జట్టే విజయం సాధించేలా కనిపించింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే సమయానికి ముంబై స్కోరు 3 వికెట్లకు 95 పరుగులు. 33 బంతుల్లో 65 పరుగులు సాధించాలి. పిచ్ స్లోగా ఉండటంతో బ్యాటింగ్ కష్టంగా ఉంది. శార్దుల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే టిమ్ డేవిడ్ బీట్ అయ్యాడు. బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అంతేకాకుండా ఎడ్జ్ తీసుకున్న సౌండ్ కూడా వచ్చింది.

ఇది కూడా చదవండి : Mumbai Indians : సచిన్ కి రోహిత్ వెన్నుపోటు.. గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఇదేనా..!

కామెంట్రీ బాక్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అవుటనే అనుకున్నారు. అయితే అంపైర్ అవుటివ్వలేదు. దాంతో పంత్ DRSకు వెళ్తారని అంతా అనుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ పంత్ దగ్గరకు వచ్చి తీసుకో తీసుకో అంటూ పదే పదే చెప్పాడు. అయితే పంత్ DRSకు వెళ్లలేదు. కాసేపటికి టీవీ రీప్లేలో అది క్లియర్ గా ఎడ్జ్ అయినట్లు తేలింది. గోల్డెన్ డక్ గా వెనుదిరగాల్సిన టిమ్ డేవిడ్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి ముంబైని విజయానికి చేరువగా తెచ్చి పెవిలియన్ కు చేరాడు.

First published:

Tags: Cricket, Delhi Capitals, Faf duplessis, Glenn Maxwell, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు