Home /News /sports /

IPL 2022 MI VS DC MUMBAI INDIANS WORRIES ABOUT THAT WORST RECORD IN OPENING GAME AGAINST DELHI CAPITALS SRD

IPL 2022 - MI Vs DC: తొలి మ్యాచ్ కు ముందు ముంబైని టెన్షన్ పెడుతున్న ఆ చెత్త రికార్డు..

Mumbai Indians

Mumbai Indians

IPL 2022 - MI Vs DC: తొలి మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ ను ఆ చెత్త రికార్డు టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆ చెత్త రికార్డు ఏంటి..? ఎందుకంత ముంబై ఇండియన్స్ జట్టు టెన్షన్ పడుతోంది..?

    ఐపీఎల్‌-2022లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)ను ఢీ కొట్టేందుకు సిద్దమైంది. ఆదివారం (మార్చి 27) బ్రబౌర్న్ వేదికగా సాయంత్రం 3:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐదు టైటిళ్లను కైవసం చేసుకుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరుకు టైటిల్ నెగ్గలేదు. సూపర్ విక్టరీతో ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విలూరుతున్నాయ్. ఇక, ముంబైలో కెప్టెన్​ రోహిత్‌ శర్మతోపాటు కీరన్‌ పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను భారీ ధరకు దక్కించుకుంది ముంబై. అయితే, ముంబైను ఓ చెత్త రికార్డు టెన్షన్ పెడుతుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఓ లుక్కేయండి.

    సూర్యకుమార్ యాదవ్ దూరం

    కీలక ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్ ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యే ఛాన్సుంది శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు సూర్యకుమార్ చేయి ఫ్రాక్చర్‌ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందిన అతడు.. గాయం నుంచి కోలుకుని శనివారం ముంబై జట్టులో చేరాడు. అయితే గాయం నుంచి కోలుకున్న అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇది కూడా చదవండి : జయహో ధోని.. తలా ఖాతాలో అదిరిపోయే రికార్డు.. ఇదే కదయ్యా మాకు కావాల్సింది..

    రోహిత్, ఇషాన్, టిమ్‌ డేవిడ్, కీరన్‌ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్‌ వంటి హిట్టర్లతో జట్టు బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. గత సీజన్ లో ఆల్ రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ స్టేజికే పరిమితమైంది రోహిత్ సేన. ఇక, టీమిండియా ప్రధాన పేస్‌ బౌలర్‌ బుమ్రా ముంబై పేస్ బౌలింగ్ దళానికి లీడర్. బుమ్రాతో పాటు జయ్‌దేవ్‌ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్‌, బాసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మురుగన్‌ అశ్విన్‌, మయాంక్ మార్కండే, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్, డేవాల్డ్‌ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరికి అంతర్జాతీయ అనుభవం తక్కువ.

    హెడ్​ టూ హెడ్ రికార్డులు​:

    ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచుల్లో ముంబై గెలిచింది. 14 మ్యాచుల్లో ఢిల్లీ విజయం సాధించింది.

    ముంబైను కలవరపెడుతున్న చెత్త రికార్డు

    ఇక, ప్రతి సారి ఓపెనింగ్ మ్యాచులో ఓడిపోవడం ముంబై ఇండియన్స్ కు అలవాటుగా మారింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే నెగ్గింది. చివరగా 2012 లో ఫస్ట్ మ్యాచ్ నెగ్గింది. అప్పట్నుంచి ఓడిపోవడం ముంబైకు అలవాటుగా మారింది. దీంతో, ఈ రికార్డు ముంబైను టెన్షన్ పెడుతుంది. ఆ చెత్త రికార్డుకు స్వస్తి పలికి ఈ మ్యాచులో నెగ్గాలని ఉవ్విల్లూరుతోంది ముంబై.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Delhi Capitals, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు