IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఘోర ఓటమితో ఆరంభించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలిచే మ్యాచ్ ను చేజేతులా ఓడిపోయింది. టాపార్డర్ విఫలమైనా ఆఖర్లో ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లలిత్ యాదవ్ (38 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) 4 వికెట్లతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (48 బంతుల్లో; 81; 11 ఫోర్లు 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించారు. ఈ మ్యాచ్ లో ఓడటం ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో తన ఆనవాయితీని కొనసాగించింది. 2008లో ఐపీఎల్ ఆరంభం కాగా.. 2012 సీజన్ లో మినహా ప్రతి ఐపీఎల్ ఎడిషన్ లోనూ ముంబై తన ఆరంభ మ్యాచ్ లో ఓడిపోతూనే వస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక దశలో ముంబై విజయం నల్లేరు మీద నడకలా కనిపించింది. అయితే అక్షర్ పటేల్ లలిత్ యాదవ్ పోరాటానికి ముంబై బౌలర్ల పేలవ బౌలింగ్ తోడవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
178 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ముంబై బౌలర్లు ఆరంభంలో కట్టడి చేశారు. బాసిల్ థంపి (3 వికెట్లు), మురుగన్ అశ్విన్ (2 వికెట్లు) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. 72 వికెట్లకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాపార్డర్ లో షా (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించాడు
ఇక ఓటమి ఖాయం అనుకన్న తరుణంలో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. అప్పటి వరకు రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారిగా జూలు విదిల్చింది. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అక్షర్, లలిత్ యాదవ్ లు దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలకు తరలించారు. అయినప్పటికీ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంపై ఎవరికీ నమ్మకాలు లేవు. ఎందుకంటే బుమ్రా ఇంకా రెండు ఓవర్లు వేయాల్సి ఉంది. అతడు డెత్ ఓవర్లల ోఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడో వేరే చెప్పనక్కర్లేదు. అయితే డెత్ ఓవర్లలో బుమ్రాను అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ లు ఊచకోత కోశారు. అతడిని మాత్రమే కాదు డానియల్ స్యామ్స్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. డానిల్ స్యామ్స్ వేసిన 19 ఓవర్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 24 పరుగులు సాధించింది .దాంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma