IPL 2022 MI VS DC LIVE SCORE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - MI vs DC : హిట్ మ్యాన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్.. ఆర్సీబికి గుడ్ న్యూస్.. టాస్ ముంబైదే..
IPL 2022 - MI vs DC
IPL 2022 - MI vs DC : ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్‌ను గెలిచి ఘనంగా ఈ సీజన్‌ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై చేతిలో ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్లో మరికాసేపట్లో కీలకపోరుకు రంగం సిద్ధం కానుంది. ముంబై ఇండియన్స్ తో డూ ఆర్ డై ఫైట్ కు ఢిల్లీ క్యాపిటల్స్ సై అంటోంది. ముంబైకి ఇది కీలకపోరు కాకపోయినా.. ఢిల్లీ, బెంగళూరులకు మాత్రం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టబ్స్ స్థానంలో డేవాల్డ్ బ్రెవిస్ తుది జట్టులోకి వచ్చాడు. సంజయ్ స్థానంలో హృతీక్ సోకీన్ వచ్చాడు. ఇక, ఢిల్లీ జట్టులోకి ధనాధన్ ఓపెనర్ పృథ్వీషా తిరిగి చేరాడు. లలిత్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చాడు ఈ ధనాధన్ బ్యాటర్.ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్‌ను గెలిచి ఘనంగా ఈ సీజన్‌ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై చేతిలో ఉంది. రోహిత్ సేన గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయనుంది. దీంతో ఆర్సీబీ జట్టు ముంబైకి ఫ్యాన్స్ గా మారారు.
ఈ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫర్వాలేదన్పించే ప్రదర్శన చేసింది. ముంబై జట్టులో రోహిత్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా మోస్తరు ప్రదర్శన చేస్తున్నారు. ఈ ఇద్దరి బ్యాట్ నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ సూపర్ టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో బుమ్రా, మెరిడిత్ కీలకం కానున్నారు. డానియల్ సామ్స్ కూడా ఫర్వాలేదన్పిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి కనీస పరువుతో సీజన్ ముగించాలని రోహిత్ సేన భావిస్తోంది.
మరోవైపు ఢిల్లీ భవితవ్యం ఆ జట్టు చేతులోనే ఉంది. చెన్నై చేతిలో ఘోర పరాజయం అనంతరం పంత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను అందుకుంది. రన్‌రేట్(0.255) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీకి బ్యాక్‌బోన్‌గా నిలుస్తున్నాడు.
డేవిడ్ వార్నర్ సైతం కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్ విభాగం కూడా రాణిస్తోంది. రిషభ్ పంత్ ఒక్కడే స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. బౌలింగ్ లో ఖలీల్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్ట్జే కీలకం కానున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగంలో కీ రోల్ ప్లే చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.