ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ లో ఇంకో రెండు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. ఆదివారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగే మ్యాచ్ తో లీగ్ దశ ఎండ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. ఒక ప్లేస్ కోసం మాజీ ఫైనలిస్టులో రేసులో ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు అదరగొట్టాయి. వీటితో పాటు తొలి ఐపీఎల్ ఎడిషన్ (2008) విన్నర్ రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా లీగ్ స్టేజ్ లో సత్తా చాటి ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. అయితే చివరి స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు పోటీ పడుతున్నాయి. గురువారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గిన ఆర్సీబీ 16 పాయింట్లతో ప్రస్తుతానికి నాలుగో స్తానంలో కూర్చొని ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అయితే ఢిల్లీ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఆర్సీబీ తన లీగ్ మ్యాచ్ లను పూర్తి చేసింది. దాంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరేది లేనిది నేటితో తేలనుంది. నేడు ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఢిల్లీని మాత్రం రెండు పెద్ద సమస్యలు వెంటాడుతున్నాయ్.ఈ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది.
అయితే అంతలోనే ఆ జట్టు గాడి తప్పింది. ఇప్పుడు ప్లే ఆఫ్ కోసం చివరి మ్యాచ్ వరకు ఆగే పరిస్థితి తెచ్చుకుంది. ఢిల్లీ ఇక గత 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి మళ్లీ ఫామ్‌ను పుంజుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్, ఫాస్ట్ బౌలర్లలో నిలకడ లేమి ఈ రెండు కారణాల వల్ల ఢిల్లీ కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్‌ను ఓడించాలంటే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టాల్సిందే.
ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ మినహా ఏ ఫాస్ట్ బౌలర్ కూడా ఈ సీజన్ లో నిలకడగా రాణించలేదు. ఖలీల్ 9 మ్యాచ్‌ల్లో 18.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. ఢిల్లీ ప్రధాన బౌలర్ అన్రిచ్ నోకియా గాయం కారణంగా ఓపెనింగ్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఫిట్‌గా మారిన తర్వాత అతని బంతుల్లో పదును తగ్గింది. 5 మ్యాచ్‌లు ఆడి 25.71 సగటుతో కేవలం 7 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ సమస్య మరో సారి రిపీట్ కాకుండా ఢిల్లీ జాగ్రత్త పడాలి.
ఢిల్లీకి మరో సమస్య కెప్టెన్ పంత్ ఫామ్. డేవిడ్ వార్నర్ తర్వాత ఢిల్లీ నుంచి అత్యధిక పరుగులు (301) సాధించిన రెండో ఆటగాడు పంత్. అయితే, అతను ఈ సీజన్లో ఇంకా హాఫ్ సెంచరీ సాధించలేదు. అంతేకాకుండా తనకు లభించిన ప్రారంభాల్ని పెద్ద ఇన్నింగ్సులుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. దీంతో లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. ఇక.. ముంబైతో పోరు బుమ్రా వర్సెస్ పంత్ ఫైట్ గా మారింది. పంత్ పై బుమ్రాదే పై చేయి. 12 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు బుమ్రా బౌలింగ్ లోనే పంత్ ఔటయ్యాడు. ఇప్పుడు ఆ జట్టు డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. దీంతో.. ఒత్తిడిలో బుమ్రాను ఎదుర్కోవడం పంత్ కి కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Royal Challengers Bangalore