IPL 2022 MI VS CSK LIVE SCORE UPDATES MUMBAI INDIANS SETS NORMAL TARGET ON SCORE BOARD SRD
IPL 2022 - MI vs CSK : రూ. 31.25 కోట్ల ఆటగాళ్ల డకౌట్లు అయితే.. తొడగొట్టిన తెలుగు బిడ్డ.. చెన్నై టార్గెట్ ఎంతంటే..
Tilak Varma (IPL Twitter)
IPL 2022 - MI vs CSK : మరోసారి ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ నిరాశపర్చారు. ఈ ఇద్దరూ డకౌట్లు అయ్యారు. అయితే, ఆఖర్లో తెలుగు తేజం తిలక్ వర్మ ఆదుకోవడంతో ముంబై మంచి స్కోరు సాధించింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు మరోసారి నిరాశపర్చారు. చెన్నై బౌలర్ల దెబ్బకి ఢీలా పడ్డారు. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 43 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ గా రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ (21 బంతుల్లో 32 పరుగులు; 3 ఫోర్లు, 1 సిక్సర్), హృతిక్ సోకిన్ (25 బంతుల్లో 25 పరుగులు ; 3 ఫోర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. బ్రావో రెండు వికెట్లతో సత్తా చాటాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్. ఒకే ఓవర్లో రోహిత్, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. కెప్టెవన్ రోహిత్ శర్మ మరోసారి నిరాపరిచాడు. చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక, ఇషాన్ కిషన్ కూడా డకౌటయ్యాడు.
ముఖేష్ చౌదరి బౌలింగ్ ఈ రూ.15.25 కోట్ల ఆటగాడు డకౌటయ్యాడు. రోహిత్, జడేజాలకు రూ. 31.25 కోట్లు ఖర్చు చేసింది ముంబై. దీంతో, 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై. ఆ కాసేపటికే ఫామ్ లో ఉన్న డేవాల్డ్ బ్రెవిస్ కూడా ఔటవ్వడంతో ముంబై కష్టాలు మరింత పెరిగాయ్. 4 పరుగులు చేసిన బ్రేవిస్.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, మరోసారి సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో ముంబైను ఆదుకునే ప్రయత్నించాడు. ఈ క్రమంలో సూపర్ షాట్లతో అలరించాడు.
అయితే, 32 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న సూర్యకుమార్ యాదవ్ ని మిచెల్ శాంట్నర్ బోల్తా కొట్టించాడు. మిచెల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన సూర్య ముఖేష్ చౌదరికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 47 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై. అయితే, ముంబై ఇన్నింగ్స్ ను యంగ్ కుర్రాళ్లు తిలక్ వర్మ, హృతిక్ సోకిన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరి ఆచి తూచి ఆడారు. ఐదో వికెట్ కు 38 పరుగులు జోడించిన తర్వాత హృతిక్ (25).. బ్రావో బౌలింగ్ లో రాబిన్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో, 85 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది ముంబై. ఆఖర్లో కీరన్ పొలార్డ్ (14) కూడా ముంబైని నిరాశపర్చాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్ లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పొలార్డ్. అయితే, ఆఖర్లో తిలక్ వర్మ, జైదేవ్ ఉనాద్కత్ (19) మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
హెడ్ టు హెడ్ రికార్డుల్లో ముంబై దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు 32 మ్యాచులు ఈ రెండు జట్ల మధ్య జరగగా.. 19 మ్యాచుల్లో ముంబై నెగ్గింది. మరో 13 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డానియల్ సామ్స్, హృతిక్ సోకిన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, జయదేవ్ ఉనాద్కత్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.