IPL 2022 MI VS CSK LIVE SCORE UPDATES CHENNAI SUPER KINGS WON THE TOSS AND OPTED TO BOWL FIRST SRD
IPL 2022 - MI vs CSK : టాస్ గెలిచిన రోహిత్.. ముంబైలో మూడు, చెన్నైలో రెండు కీలక మార్పులు
IPL 2022 - MI vs CSK
IPL 2022 - MI vs CSK : హెడ్ టు హెడ్ రికార్డుల్లో ముంబై దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు 32 మ్యాచులు ఈ రెండు జట్ల మధ్య జరగగా.. 19 మ్యాచుల్లో ముంబై నెగ్గింది. మరో 13 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. వరుసగా 6 పరాజయాలతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్.. ఆరు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ ల్ని పక్కన పెట్టిన సీఎస్కే.. ప్రిటోరియస్, మిచెల్ శాట్నర్ లకు చోటు కల్పించింది. ఇక, మూడు మార్పులతో ముంబై బరిలోకి దిగుతోంది. మెరిడిత్, హృతిక్ షోకిన్, డానియల్ సామ్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు.. ముంబై. నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్.
అయితే ఈ రెండు జట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సగం లీగ్ పూర్తవకముందే ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఒక్కదాంట్లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన రోహిత్ సేన పదో స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్‌లో ఓడితే ముంబైకి ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోయినట్లే. చెన్నైది దాదాపు అలాంటి పరిస్థితే.
ముంబై జట్టులో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా సరిగ్గా రాణించింది లేదు. ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యం అందిస్తే ముంబైకి ఢోకా ఉండదు. ముంబై కెప్టెన్ రోహిత్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆ తర్వాత వచ్చే బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పొలార్డ్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో, తనకిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ పై చెలరేగుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం ఈ సీజన్ లోనే అత్యంత బలహీనంగా ఉంది. జయదేవ్ ఉనాద్కత్, రిలే మెరిడిత్ లతో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. ఇక, డానియెల్ సామ్స్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ లో ఓపెనర్ రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే మంచి టచ్ లో ఉన్నారు. అంతేకాకుండా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం కొండంత అండ. గుజరాత్‌తో అతను 73 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు. అయితే, అంబటి రాయుడు, జడేజాల ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. ధోని కూడా రాణించాల్సి ఉంది. ముంబై మాదిరిగానే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కూడా బలహీనంగా ఉంది. ధారళంగా పరుగులిస్తున్న క్రిస్ జోర్డాన్ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ బరిలోకి దిగనున్నాడు. మహీష్ తీక్షణ రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. డ్వేన్ బ్రావో కూడా చెన్నై బౌలింగ్ లో కీలకం.
హెడ్ టు హెడ్ రికార్డులు :
హెడ్ టు హెడ్ రికార్డుల్లో ముంబై దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు 32 మ్యాచులు ఈ రెండు జట్ల మధ్య జరగగా.. 19 మ్యాచుల్లో ముంబై నెగ్గింది. మరో 13 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డానియల్ సామ్స్, హృతిక్ సోకిన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, జయదేవ్ ఉనాద్కత్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.