IPL 2022 MI VS CSK LIVE SCORE UPDATES CHENNAI SUPER KINGS WON BY 3 WICKETS AND DHONI BRILLIANT KNOCK SRD
IPL 2022 - MI vs CSK : ధోని తడాఖా.. ఆఖరి ఓవర్ లో మహీ విశ్వరూపం.. చెన్నై సూపర్ విక్టరీ..
ధోని
IPL 2022 - MI vs CSK : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. మరో పోరు ఆఖరి వరకు జరిగి ఉత్కంఠను రేపింది. హోరాహోరీగా సాగిన పోరులో ధోని తడాఖా చూపించడంతో ఆఖరికి విజయం చెన్నై సొంతమైంది.
వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. ఆఖరి వరకు జరిగిన హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ పోరులో ధోని తన తడాఖా ఏంటో చూపాడు. . ఆఖరి ఓవర్ లో 17 పరుగులు అవసరమవ్వగా ఫస్ట్ బంతికి ప్రిటోరియస్ ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికి బ్రావో సింగిల్ తీయగా.. మరోసారి ధోని తన తడాఖా ఏంటో చూపించాడు. నాలుగు బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా ధోని.. వరుసగా 6,4,2,4 కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ధోని (13 బంతుల్లో 28 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపుల దెబ్బకి ముంబైకి మరో ఓటమి తప్పలేదు.156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో, ముంబై పరుగుల తేడాతో ఫస్ట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై బ్యాటర్లలో అంబటి రాయుడు (35 బంతుల్లో 40 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప ( 25 బంతుల్లో 30 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రిటోరియస్ ( 14 బంతుల్లో 22 పరుగులు) రాణించారు. డానియల్ సామ్స్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ లాగే ఆదిలోనే తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక, మిచెల్ శాంట్నర్ ను వన్ డౌన్ లోకి దింపి ప్రయోగం చేసింది సీఎస్కే. అయితే, ఆ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. 11 పరుగులు చేసిన శాంట్నర్ ఉనాద్కత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత చెన్నై ఇన్నింగ్స్ ని అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల పార్టనర్ షిప్ కూడా నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని జైదేవ్ ఉనాద్కత్ విడదీశాడు.
25 బంతుల్లో 30 పరుగులు చేసిన ఉతప్ప.. డెవాల్డ్ బ్రెవిస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 66 పరుగులకు మూడో వికెట్ కు కోల్పోయింది. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శివమ్ దూబే కూడా నిరాశపర్చాడు. 13 పరుగులు చేసిన శివమ్ దూబేని కూడా డేనియల్ సామ్స్ యే ఔట్ చేశాడు. ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్ కి పెవిలియన్ బాట పట్టాడు శివమ్ దూబే. ఆ తర్వాత 35 బంతుల్లో 40 పరుగులు చేసిన అంబటి రాయుడుని కూడా డానియల్ సామ్స్ ఔట్ చేశాడు. పొలార్డ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రాయుడు. ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించాడు డేనియల్ సామ్స్. ఫస్ట్ మూడు మ్యాచుల్లో ముంబై ఓటమికి కారణమైన సామ్స్.. ఈ మ్యాచ్ లో హీరోగా మారాడు. ఆ తర్వాత చెన్నై కెప్టెన్ జడేజా కూడా మరోసారి నిరాశపర్చాడు.
కేవలం 3 పరుగులు చేసిన జడేజా.. తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆఖర్లో ధోని, ప్రిటోరియస్ బౌండరీలతో చెన్నై శిబిరంలో ఆశలు రేపారు. ముఖ్యంగా ప్రిటోరియస్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఆఖరి ఓవర్ లో 17 పరుగులు అవసరమవ్వగా ఫస్ట్ బంతికి ప్రిటోరియస్ ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికి బ్రావో సింగిల్ తీయగా.. మరోసారి ధోని తన తడాఖా ఏంటో చూపించాడు. నాలుగు బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా ధోని.. వరుసగా 6,4,2,4 కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
అంతకుముందు.. ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 43 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ గా రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ (21 బంతుల్లో 32 పరుగులు; 3 ఫోర్లు, 1 సిక్సర్), హృతిక్ సోకిన్ (25 బంతుల్లో 25 పరుగులు ; 3 ఫోర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. బ్రావో రెండు వికెట్లతో సత్తా చాటాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.