ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో హోరాహోరీగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.10.5 కోట్లకు దక్కించుకొంది. మరోవైపు కీలక ఆటగాళ్లుగా పేరున్న ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ముంబై ఇండియన్స్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారి, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్‌ఫించ్, టీమ్ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారాలను ఎవరూ కొనుగోలు చేయలేదు. మరోవైపు పంజాబ్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. మిగతావారిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్కో జెన్సన్ను రూ.4.20 కోట్లకు తీసుకుంది. అలాగే టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబేను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై అత్యధిక ధర రూ.9.25 కోట్లకు కొనుగోలు చేయగా ఈసారి అతడి ధర అమాంతం పడిపోయింది. కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ రూ.90లక్షలకే దక్కించుకుంది.
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) కు సంబంధించి ఆటగాళ్ల మెగా వేలం (IPL Mega Auction 2022) ప్రక్రియ మొదటి రోజు హోరాహోరీగా సాగింది. గెలుపు గుర్రాలు కోసం తగ్గేదే లే అన్నట్టు పోరాడాయ్ అన్నీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈసారి రెండు కొత్తవాటితో కలిపి మొత్తం పది జట్లు ఆటగాళ్ల కొనుగోళ్లకు పోటీపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలిరోజున జాబితాలో మొత్తం 161 మంది ఆటగాళ్లున్నా, కేవలం 97 మంది మాత్రమే వేలంలోకి వచ్చారు. అందులో 74 మంది ఆటగాళ్లే అమ్ముడుపోయారు. 23 మంది ప్లేయర్లను ఎవరూ కొనలేదు. ఐపీఎల్ 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రెండోరోజు, ఆదివారం అక్సెలరేటెడ్ విధానం మొదలవుతుంది. అంటే తొలిరోజు వేలంలో 161 మందిలో మిగిలిన ఆటగాళ్లు సెట్ల వారీగా వేలానికి వస్తారు. ఆ తర్వాత అక్సెలరేటెడ్ విధానం మొదలవుతుంది. మిగిలిన వారి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడతాయి. వీరిలో తమకు నచ్చిన వారిని ఫ్రాంఛైజీలు ప్రతిపాదిస్తాయి. ఇలా ప్రతిపాదించిన జాబితా నుంచి ఆటగాళ్లను ఎంచుకుంటారు. ఆ ఆటగాళ్ల కోసం జట్లు పోటీ పడనున్నాయ్.
మొదటి రోజు వేలం తర్వాత ఏ జట్టులో ఎవరున్నారంటే
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు), తుషార్ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్ చాహర్ (రూ.14 కోట్లు), ఆసిఫ్ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 12 కోట్లు), పృథ్వీ షా (రూ. 8 కోట్లు), ఆన్రిచ్ నోర్త్జ్ (రూ. 6 కోట్లు), శార్దూల్ (రూ.10.75 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), వార్నర్ (రూ.6.25 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), కమలేష్ నాగర్కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.20 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.16.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్: హార్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.30 లక్షలు), రాయ్ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), సాయి కిశోర్ (రూ.3 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.18.85 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు), శివమ్ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు), కమిన్స్ (రూ.7.25 కోట్లు), శ్రేయస్ (రూ.12.25 కోట్లు), నితీశ్ రాణా (రూ. 8 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.65 కోట్లు
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టాయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు), డికాక్ (రూ.6.75 కోట్లు), మార్క్‌వుడ్ (రూ.7.50 కోట్లు), మనీశ్ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్ (రూ.8.75 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్ సింగ్ (రూ.50 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.6.90 కోట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 6 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు), బాసిల్ థంపి (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్ బ్రేవిస్ (రూ.3 కోట్లు), ఇషాన్ కిషాన్ (రూ.15.25 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.27.85 కోట్లు
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు), అర్షదీప్ సింగ్ (రూ. 4 కోట్లు), జితేశ్ శర్మ (రూ.20 లక్షలు), షారుక్ ఖాన్ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), ధావన్ (రూ.8.25 కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.28.65 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు), కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు), బౌల్ట్ (రూ.8 కోట్లు), అశ్విన్ (రూ.5 కోట్లు), చాహల్ (రూ.6.50 కోట్లు), హెట్మయర్ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్ (రూ.7.75 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు), డుప్లెసిస్ (రూ.7 కోట్లు), అనుజ్ రావత్ (రూ.3.40 కోట్లు), హేజిల్‌వుడ్ (రూ.7.75 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.20 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు), దినేశ్ కార్తీక్ (రూ.5.50 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు); మిగిలిన మొత్తం: 9.25 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు), పూరన్ (10.75 కోట్లు), సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), నటరాజన్ (రూ.4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.20 లక్షలు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.50 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.15 కోట్లు.
వేలం ముగిసేసరికి ప్రతి జట్టులో కనిష్టంగా 18 మంది.. గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న రూ.90 కోట్ల నుంచి కనీసం రూ.67.5 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రతి జట్టులో ఎనిమిది మందికి తగ్గకుండా విదేశీ ఆటగాళ్లు ఉండాలి.
రైట్ టు మ్యాచ్ ఆప్షన్ లేదు
2018 ఐపీఎల్ మెగా వేలం మాదిరిగా ఈసారి రైట్ టు మ్యాచ్ కార్డ్స్ అందుబాటులో లేవు. కొత్తగా రెండు జట్లు ఐపీఎల్లో చేరిన నేపథ్యంలో ఆ జట్లు బలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సదుపాయాన్ని తీసేశారు.
సైలెంట్ టైబ్రేకర్
2010 ఐపీఎల్ వేలం నుంచి సైలెంట్ టై బ్రేకర్ ఉంది. కానీ ఇప్పటిదాకా దీన్ని ఉపయోగించలేదు. ఒక ఆటగాడి కోసం రెండు జట్లు పోటీపడుతున్నప్పుడు అది వారికి చివరి బిడ్ అయినప్పుడు.. రెండు జట్లకు సమాన మొత్తంలో డబ్బులు అందుబాటులో ఉన్నప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. తాము ఆ ఆటగాడికి ఇంతే డబ్బులు చెల్లిస్తామని రెండు జట్లు లిఖిత పూర్వకంగా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ టైబ్రేక్ బిడ్ ద్వారా చెల్లించే మొత్తాన్ని వారికి అందుబాటులో ఉన్న డబ్బు నుంచి తీసుకోరు. ప్రత్యేకంగా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.