Home /News /sports /

IPL 2022 MEGA AUCTION WILL BE HELD IN BENGALURU ON FEB 12 AND FEB 13 SAYS BRIJESH PATEL SRD

IPL 2022 Auction Date : ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మెగావేలానికి ముహుర్తం ఖరారు..

IPL 2022 Mega Auction

IPL 2022 Mega Auction

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది.

    ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌ కోసం క్రికెట్ ప్రియులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. బీసీసీఐ కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ (BCCI) ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది.ఇక, ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. మెగావేలానికి బెంగళూరుని వేదికగా ఎంపిక చేసిందని బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఇప్పటివరకు ఐపీఎల్‌ను స్పాన్సర్ చేస్తున్న చైనీస్ మొబైల్ మేకర్ వివో స్థానంలో టాటా గ్రూప్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ నిర్ధారించారు. దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ కొత్త స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ 'వీవో' వైదొలగనుంది. ఈ మేరకు ఐపీఎల్‌ కమిటీ నిర్ణయించినట్లు ఐపీఎల్‌ ఛైర్మన్ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

    2018 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి 2022 సీజన్‌ వరకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు వీవో.. రూ. 2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో గల్వాన్‌ లోయలో.. భారత్‌, చైనా సైన్యం మధ్య ఘర్ఘణల నేపథ్యంలో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' వైదొలగగా డ్రీమ్‌-ఎలెవన్‌కు హక్కులు దక్కాయి. అయితే.. 2021 ఐపీఎల్‌ సీజన్‌కు మాత్రం తిరిగి 'వివో' స్పాన్సర్‌గా వ్యవహరించింది.

    లక్నో, అహ్మదాబాద్ జట్లు ఈ ఏడాది ప్రీమియర్ లీగ్‌లో భాగం కానున్నాయి. వీటితో కలుపుకుని ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో తలపడనున్న మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. రూ. 7,090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని ఆర్‌పీసీజీ గ్రూప్ దక్కించుకోగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ కేపిటల్ రూ. 5,625 కోట్లకు చేజిక్కించుకుంది.


    కొత్తగా వచ్చిన చేరిన రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ఆటగాళ్ల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటి వరకు 8 జట్లు గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకుని మిగతా వారిని రిలీజ్ చేశాయి. వారి నుంచి కొత్త జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకోనున్నాయి.

    ఇది కూడా చదవండి : బాబోయ్.. కోహ్లీ మాములోడు కాదు.. జట్టు మొత్తం పడ్డ కష్టాన్ని తన ఒక్కడి ఖాతాలోనే వేసుకున్నాడుగా..!

    మరోవైపు, కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ అర్ధంతరంగా దుబాయ్‌కు తరలిపోయింది. రెండో అంచె మ్యాచ్‌లు మొత్తం అక్కడే జరిగాయి. కాగా, ఈసారి ఐపీఎల్ వేదిక ఎక్కడన్న విషయాన్ని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. అయితే, గరిష్టంగా నాలుగైదు వేదికలపై నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే.. ముంబై వేదికగా ఐపీఎల్ మొత్తాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Cricket, IPL 2022, IPL Auction 2022, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు