రెండు రోజుల పాటు క్రికెట్ (Cricket) అభిమానులతో పాటు ఆటగాళ్ల (Players)ను కూడా అలరించడానికి ఐపీఎల్ (IPL)రెడీ అయ్యింది. ఆటతో కాదు... మెగా వేలం (Mega Auction)తో... జాక్‌పాట్ కొట్టబోయే ఆటగాళ్లు ఎవరో... అమ్ముడుపోని ఆ దురదృష్టవంతులెవరో మరో రెండు రోజుల్లో తేలనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి బయటకు వచ్చిన వార్నర్ (Warner) ఏ ఫ్రాంచైజీకి చేరుకుంటాడో... శ్రేయస్ అయ్యర్ (Shreya iyer) రాత ఎలా ఉందో... ఇంకొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది. లైవ్ ఎందులో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎప్పుడు, ఎక్కడ?
ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు (Bangalore) వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
- ఎన్నిగంటలకు ఆరంభం కానుంది?
ఉదయం 11 గంటలకు
- ప్రత్యక్షప్రసారం ఎందులో?
స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రాంతీయ భాషల్లో కూడా కామెంటరీ ఉండనుంది.
- మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి?
ఈ ఏడాది రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants ), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans ) ఐపీఎల్లో ఎంట్రీ ఇస్తున్నాయి. దాంతో మొత్తం 10 జట్లు వేలంలో పాల్గొంటున్నాయి.
- ఎంతమంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు?
మొత్తం 1,214 మంది ప్లేయర్లు వేలం కోసం రిజస్టర్ చేసుకోగా అందులోంచి 590 మంది ప్లేయర్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో 370 మంది భారత క్రికెటర్లు కాగా... 220 మంది ఫారెన్ ఆటగాళ్లు. 590 మంది ఆటగాళ్లలో 228 ప్లేయర్స్ మాత్రమే జాతీయ జట్టుకు ఆడారు. మిగిలిన వారు అన్క్యాప్డ్ ప్లేయర్స్. తొలి రోజు 161 మంది ప్లేయర్లు వేలంలోకి రానుండగా... మిగిలిన వారు ఆదివారం వస్తారు. వేలంలో ఎవరైనా అమ్ముడవ్వకపోతే. వేలం చివరి రోజు వారిని మరోసారి ఆక్షన్‌లోకి తీసుకువస్తారు. ఆ సమయంలో వారి బేస్ ప్రైజ్‌ను కూడా తగ్గించే వీలుంది.
- ఒక్కో జట్టు ఎంత మందిని తీసుకోవచ్చు?
లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టు కూడా గరిష్టంగా 25 మందిని తీసుకునే వెసులుబాటు ఉంది. అలాగే టీమ్ సైజ్ 18 మంది ప్లేయర్ల కంటే తక్కువగా ఉండరాదు. టీమ్‌లో ఓవర్సీస్ ప్లేయర్ల సంఖ్య 8కి మించరాదు.
- వీరిపై ఓ కన్నేయండి!
ఈ మెగా వేలంలో పలువురు కీలక ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. వారిలో ముఖ్యంగా డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, జేసన్ హోల్డర్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యశ్ ధుల్ (అండర్-19 కెప్టెన్) ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, David Warner, IPL 2022, IPL Auction 2022, Shreyas Iyer