Home /News /sports /

IPL 2022 MATHEESHA PATHIRANA SET TO JOIN CHENNAI SUPER KINGS SQUAD AS ADAM MILNES REPLACEMENT SRD

Chennai Super Kings : చెన్నై జట్టులోకి జూనియర్ మలింగ.. ధోని శిక్షణలో రాటుదేలడం ఖాయం..

చెన్నై సూపర్ కింగ్స్ (PC: CSK TWITTER)

చెన్నై సూపర్ కింగ్స్ (PC: CSK TWITTER)

Chennai Super Kings : ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 1 మాత్రమే గెలిచింది.

    ఐపీఎల్​ మెగా టీ20 లీగ్​ 15వ సీజన్​ (IPL 2022) హోరాహోరీగా సాగుతోంది. ప్రతి జట్టు కూడా విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 32 మ్యాచులు ముగిశాయ్. టాప్ 4 లో నిలవడం కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయ్. అయితే, ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 1 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సీఎస్‌కే ఇప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)తో తలపడనుంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేలో ఓ మార్పు చోటు చేసుకుంది. జూనియర్ మలింగగా పేరొందిన శ్రీలంక మీడియం పేసర్ మహిషా పతిరణ(matheesha pathirana) కు జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే స్థానంలో మహిషా జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత మిల్నే గాయపడ్డాడు మరియు అప్పటి నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

    మహిషా బౌలింగ్ యాక్షన్ శ్రీలంక వెటరన్ బౌలర్ లసిత్ మలింగ మాదిరిగానే ఉంటుంది. అందుకే అతడిని జూనియర్ మలింగ అంటారు. ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున ఆడాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు. క్యాండీతో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన మహిష వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ వేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ.. ఇప్పుడు అతను ప్రత్యామ్నాయంగా CSKలోకి ప్రవేశించాడు.


    ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ను రూ.20 లక్షల బేస్​ ప్రైజ్​తో జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.ఈ ఐపీఎల్​ సీజన్​లో దీపక్​ చాహర్​ తర్వాత సీఎస్​కే నుంచి అడమ్​ మిల్నే టోర్నీకి దూరమయ్యాడు. మిల్నే కేవలం ఒకే మ్యాచ్​ ఆడి 2.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. వికెట్లేమీ తీయలేదు. తొలి మ్యాచ్​ తర్వాత మాట్లాడిన సీఎస్​కే కోచ్​ స్టిఫెన్​ ఫ్లెమింగ్​.. మిల్నే త్వరగా కోలుకుని జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, టోర్నీ మొత్తానికి దూరం కావటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.


    మరోవైపు, చెన్నై సూపర్​ కింగ్స్​ ఓపెనర్​ డెవాన్​ కాన్వే ఐపీఎల్​ను వీడాడు. తన వివాహం కోసం భారత్​ను వీడి దక్షిణాఫ్రికా చేరుకున్నాడు. మరోవారం పాటు ఐపీఎల్​కు దూరం కానున్నాడని సీఎస్​కే వర్గాలు తెలిపాయి. అయితే.. కాన్వే ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్​ ఆడాడు. దీంతో అతడి సేవలను జట్టు అంతగా కోల్పోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాన్వే ఏప్రిల్​ 24(ఆదివారం) సీఎస్​కే స్క్వాడ్​లో చేరతాడని సమాచారం. అయినప్పటికీ కొవిడ్​-19 ప్రోటోకాల్స్​ ప్రకారం మూడు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సీఎస్​కే క్యాంప్​లో చేరాలి. దీంతో వచ్చే రెండు మ్యాచ్​లకు దూరం కానున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Ravindra Jadeja

    తదుపరి వార్తలు