హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఐపీఎల్ ఆరంభానికి ముందే ధోని టీంకు ఎదురు దెబ్బ.. గాయంతో ఆ బౌలర్ సీజన్ మొత్తానికే దూరమయ్యే చాన్స్!

IPL 2022: ఐపీఎల్ ఆరంభానికి ముందే ధోని టీంకు ఎదురు దెబ్బ.. గాయంతో ఆ బౌలర్ సీజన్ మొత్తానికే దూరమయ్యే చాన్స్!

MS Dhoni

MS Dhoni

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. వేలంలో కోట్లు పలికిన ఆ జట్టు స్టార్ బౌలర్ గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...

IPL 2022:  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మార్చి 26 నుంచి ఆరంభం కానున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (ipl governing council)  గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ధనాధన్ లీగ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో జట్టు కూర్పుపై ఫ్రాంచైజీలు (franchises) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించేందుకు సిద్ధమైంది. గతేడాదిలా కాకుండా ఈ ఏడాది నుంచి ఐపీఎల్ లో పాల్గొనే జట్ల సంఖ్య 10కి చేరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం (Mega Auction) కూడా విజయవంతంగా  పూర్తయింది. అయితే డిఫెండింగ్ చాంపియన్, మహేంద్ర సింగ్ (MS Dhoni) నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టుకు లీగ్ ఆరంభానికంటే ముందే భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే చదవండి

మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు ఐపీఎల్ టైటిల్ ను ఇప్పటి వరకు నాలుగు సార్లు గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తర్వాత అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా కూడా చెన్నై ఉంది. అంతేకాకుండా ఈ నెలలో జరిగిన వేలంలో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి ఆటగాళ్లను సైతం కొనుగోలు చేసింది. అయితే ఆ జట్టును ఇప్పుడు ఒక వార్త కలవరపెడుతుంది. వేలంలో రూ.14 కోట్లు పలికిన స్టార్ పేసర్ దీపక్ చహర్ (Deepak chahar) గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే చెన్నై జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లే...

వెస్టిండీస్ (West Indies)తో గత ఆదివారం జరిగిన మూడో టి20 సందర్భంగా టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయపడ్డాడు. మూడో ఓవర్ ఆఖరి బంతి వేసే క్రమంలో దీపక్ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో తన పూర్తి కోటా బౌలింగ్ చేయకుండానే కుంటుతూ మైదానాన్ని వీడాడు. అనంతరం శ్రీలంక (Srilanka)తో జరిగే టి20 సిరీస్ కు కూడా దూరమయ్యాడు. తాజాగా దీపక్ చహర్ గురించి తెలిసిన వార్త ఏంటంటే... అతడు గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టేట్లు ఉందని. ఐపీఎల్ ఆరంభం నాటికి దీపక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... ధోనీ టీమ్ కు భారీ దెబ్బ తగిలినట్లే

2018 నుంచి కూడా దీపక్ చహర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కీలక బౌలర్ గా ఉంటూ వస్తున్నాడు.  ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో దీపక్ చహర్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దీపక్ ది అందె వేసిన చెయ్యి. 2018లో 12 మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీసిన అతడు... 2019లో 17 మ్యాచ్ ల్లో ఏకంగా 22 వికెట్లు తీశాడు. ఇక 2020లో పెద్దగా ఆకట్టుకోని దీపక్... 2021లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 15 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసి చెన్నై ఐపీఎల్ టైటిల్ ను నాలుగో సారి గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే తాజా గాయం అతడిని ఐపీఎల్ 2022కి దూరం చేసేలా కనిపిస్తోంది.

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Mumbai Indians, Sri Lanka, West Indies

ఉత్తమ కథలు