హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : గంభీర్ నోట పచ్చి బూతు మాట.. ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ తల్లినే..

IPL 2022 : గంభీర్ నోట పచ్చి బూతు మాట.. ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ తల్లినే..

గంభీర్ (PC : TWITTER)

గంభీర్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) జట్టుకు మెంటార్ గా పనిచేస్తోన్న గౌతం గంభీర్ (Gautam Gambhir) కంట్రోల్ తప్పాడు. పచ్చి బూతులతో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బ్యాటర్ పై విరుచుకుపడ్డాడు.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) జట్టుకు మెంటార్ గా పనిచేస్తోన్న గౌతం గంభీర్ (Gautam Gambhir) కంట్రోల్ తప్పాడు. పచ్చి బూతులతో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బ్యాటర్ పై విరుచుకుపడ్డాడు. తాను లక్నో మెంటార్ గా ఉన్నానని, లోక్ సభ ఎంపీ అనే విషయాన్ని కూడా మర్చిపోయిన అతడు సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలాన్ని వాడాడు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 6 పరుగుల తేడాతో గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, పవర్ హిట్టర్ రోవ్ మన్ పావెల్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఒక దశలో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించేలా కనిపించింది. అయితే రిషభ్ పంత్ ను మోసిన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. మరికాసేపటికే లలిత్ యాదవ్ కూడా పెవలియన్ కు చేరాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న పావెల్ మాత్రం భారీ షాట్లతో లక్నో విజయాన్ని దూరం చేసేలా కనిపించాడు. అయితే మోసిన్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన పావెల్ డీప్ మిడ్ వికెట్ దగ్గర కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు. అప్పటి వరకు లక్నో డగౌట్ లో చాలా టెన్షన్ పడుతూ కనిపించిన గంభీర్.. ఒక్కసారిగా లేచి పచ్చి బూతు మాట్లాడాడు. అయితే దీనిని ఎవరిని ఉద్దేశిస్తూ అన్నాడో క్లారిటీగా తెలియదు. అయితే తమ విజయాన్ని దూరం చేసేలా కనిపించిన పావెల్ ను ఉద్దేశిస్తూ ఈ బూతు మాట అన్నాడని మ్యాచ్ చూసిన వారికి అర్థం అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్ మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడినా ఢిల్లీకి గెలుపును మాత్రం అందించలేకపోయారు.

ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా లీగ్ లో లక్నో 6వ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది 5వ ఓటమి కావడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, Gautam Gambhir, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు