Home /News /sports /

IPL 2022 LUCKNOW SUPERGIANTS ALL ROUNDER MARCUS STOINIS ANGRY ON FIELD UMPIRE CHRIS GAFFANEY AGAINST HIS WRONG DECISION IN IPL 2022 SJN

Marcus Stoinis : అంపైర్ ను F*** YOU అంటూ ఊగిపోయిన లక్నో స్టార్ ఆల్ రౌండర్... కారణం అదేనా?

హేజల్ వుడ్ (PC: IPL)

హేజల్ వుడ్ (PC: IPL)

IPL 2022 - Marcus Stoinis : లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినస్ (marcus stoinis) ఆగ్రహంతో ఊగిపోయాడు. తన  అవుట్ కు కారణం అయిన అంపైర్ పై అసభ్య పదజాలంతో దూషిస్తూ పెవిలియన్ కు చేరుకున్నాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 - Marcus Stoinis : లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినస్ (marcus stoinis) ఆగ్రహంతో ఊగిపోయాడు. తన  అవుట్ కు కారణం అయిన అంపైర్ పై అసభ్య పదజాలంతో దూషిస్తూ పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయిట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో టీం... 18వ ఓవర్ ముగిసే సరికి 148/6గా నిలిచింది. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయం సాధించాలంటే 34 పరుగులు సాధించాలి. క్రీజులో స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినస్ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్సర్), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.

లక్నో విజయం కష్ట సాధ్యంగా ఉన్నా... క్రీజులో భారీ హిట్టర్లు ఉండటంతో రాహుల్ టీం ఇంకా ఆశలు పెట్టుకొనే ఉంది. 19వ ఓవర్ వేయడానికి జాస్ హేజల్ వుడ్ బౌలింగ్ కు రాగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో మార్కస్ స్టొయినస్ ఉన్నాడు. తొలి బంతిని హేజల్ వుడ్ ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వేశాడు. వాస్తవానికి దానిని వైడ్ గా ప్రకటించాలి. కానీ, అంపైర్ క్రిస్ గఫానీ వైడ్ గా ప్రకటించలేదు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన స్టొయినస్ అది వైడ్ అంటూ గఫానీకి సైగ చేశాడు. అయితే గఫానీ మాత్రం చలనం లేకుండా ఉన్నాడు. స్టొయినస్ పిచ్ మధ్య వరకు వస్తూ అంపైర్ ను చూస్తూ ’ అది వైడ్ ఎందుకు కాదు అన్నట్లు‘ చూశాడు. ఇక ఆ తర్వాతి బంతిని ఫైన్ లెగ్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నంలో స్టొయినస్ వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్ అయ్యాడు. దాంతో సహనం కోల్పోయిన అతడు ’F*** YOU‘ అంటూ అరుస్తూ వెళ్లిపోయాడు. ఇది మైక్ స్టంప్ లో క్లియర్ గా రియాక్ట్ అయ్యింది కూడా. అంతకు ముందు బంతిని వైడ్ గా ప్రకటించకపోవడంతో ఏకాగ్రత కోల్పోయిన స్టొయినస్ ఆ తర్వాత బంతికే అవుటయ్యాడు. దాంతో అంపైర్ నే అతడు ఆ పదంతో దూషించాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. స్టొయినస్ అలా రియాక్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి హేజల్ వుడ్ వేసిన ఓవర్ తొలి బంతి వైడ్ అని తెలుస్తుంది. మ్యాచ్ అనంతరం హేజల్ వుడ్ కూడా ఆ బంతిని వైడ్ గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం అన్నాడు. ఆ విషయంలో తాను లక్కీ అంటూ వ్యాఖ్యానించాడు.



ఈ ఏడాది ఐపీఎల్ లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో హాట్ టాపిక్ గా మారారు. అటు ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు ఇటు థర్డ్ అంపైర్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Lucknow Super Giants, Mohammed Siraj, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు