హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలా .. వైరలవుతున్న లక్నో వెరైటీ సెలబ్రేషన్స్..

IPL 2022 : ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలా .. వైరలవుతున్న లక్నో వెరైటీ సెలబ్రేషన్స్..

IPL 2022 : విజయం తర్వాత ఓ జట్టు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఐపీఎల్ లోకి కొత్త వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కొత్తగా సెలబ్రేషన్స్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants).. గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. టైటిల్ హాట్ ఫేవరెట్, తనకంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)ను మట్టి కరిపించింది. 211 పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది. ఐపీఎల్ ఫార్మట్‌కు తగ్గట్టుగా సత్తా చాటారు లక్నో జెయింట్ బ్యాటర్లు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఊతప్ప (50), శివమ్‌ దుబే (49), మొయిన్‌ అలీ (35) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆ తర్వాత 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూ నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) ఎవిస్​ లూయిస్‌(55) పరుగులతో అద్భుతంగా రాణించారు.

  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది లక్నో. మ్యాచ్​ తర్వాత డ్రెస్సింగ్​ రూంలో లక్నో ఆటగాళ్లు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. మెంటర్​ గౌతమ్​ గంభీర్​తో సహా ఆటగాళ్లంతా కలిపి పాటలను పాడుతూ సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. లక్నో జట్టు సోషల్​మీడియాలో షేర్​ చేసింది. ఇక, ఈ సెలబ్రేషన్స్ పై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. బాబు.. ఇవేం సెలబ్రేషన్స్.. మేం ఎడా సూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

  ఇక, మైదానంలోని డగౌట్‌లో కూర్చున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటర్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగానే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ, సహచరులను పంచ్‌ చేస్తూ తనదైన శైలిలో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  ఇది కూడా చదవండి : అయ్యో.. కోహ్లీ వల్ల ఆ అభిమానికి ఎంత అన్యాయం జరిగింది.. పాపం, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది..

  లక్నో ఇన్నింగ్‌లో ఇవాన్ లెవిస్ బ్యాటింగ్ హైలైట్. వన్‌డౌన్ బ్యాటర్ మనీష్ పాండే అవుటైన తరువాత నంబర్ 3లో బ్యాటింగ్ దిగాడతను. అప్పటికి జట్టు స్కోరు 11.2 ఓవర్లల్లో 106 పరుగులు. బ్యాటింగ్‌కు దిగడంతోనే స్కోర్‌బోర్డుకు పని చెప్పాడు. 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోలేదు. పేసరా, స్పిన్నరా అనేది చూల్లేదు. మూడు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.

  First published:

  Tags: Chennai Super Kings, Gautam Gambhir, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Viral Video

  ఉత్తమ కథలు