IPL 2022 LUCKNOW IPL TEAM NAMED AS LUCKNOW SUPER GIANTS BY SANJEEV GOENKA SRD
IPL 2022 - Lucknow : పాత పేరే మార్చి లక్నోకు పెట్టిన యాజమాన్యం.. ఏం పేరు పెట్టారంటే..
Lucknow IPL Team
IPL 2022 - Lucknow : ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం అభిమానులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త టీమ్‌లో వచ్చి చేరడం వల్ల మరింత మజా అందించేందుకు రెడీ అయింది ధనాధన్ లీగ్.
ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం అభిమానులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త టీమ్‌లో వచ్చి చేరడం వల్ల మరింత మజా అందించేందుకు రెడీ అయింది ధనాధన్ లీగ్. ఇక, ఈ సీజన్ కోసం బీసీసీఐ (BCCI) పనులన్నీ వేగవంతం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలన్న దూకుడుతో ఉంది బీసీసీఐ.దీనికి సంబంధించిన మెగావేలం (IPL 2022 Mega Auction) వచ్చే నెలలో జరగనుంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్నాకొద్దీ అభిమానుల్లో ఆసక్తి మరింత రెట్టింపు అవుతోంది. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఆక్షన్ అనివార్యమైంది.ఇక వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో ఐపీఎల్ జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలి.. ఎంత వరకు ధర వెచ్చించాలని ప్లాన్ వేసుకుంటున్నాయ్.
ఇక, ఈ సీజన్ లో కొత్తగా రెండు జట్లు పాల్గొనబోతున్నాయన్న విషయం అందరికి తెలింసిందే. రెండు జట్లలో ఒకటి అహ్మదాబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా లక్నో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, లక్నో తన జట్టు పేరును ప్రకటించింది. జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్‌గా (Lucknow Super Giants ) నామకరణం చేసింది. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా(Sanjeev goyanka) ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించారు.
అభిమానుల నుంచి వచ్చిన సూచనల మేరకే జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అని పేరు పెట్టినట్లు సంజీవ్ గోయెంకా తెలిపారు. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా 2017లో పూణే సూపర్‌జెయింట్స్‌గా పేరు పొందిన IPL జట్టును కొనుగోలు చేశారు. ఈ జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. 2018 లో ఆ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లు, స్టోయినిస్ రూ. 9.5 కోట్లు, రవి బిష్ణోయ్ రూ. 4కోట్లుకు తీసుకోగా.. ఇంకా ఆ జట్టు వద్ద రూ.60 కోట్ల నగదు మిగిలి ఉంది. ఆ జట్టు త్వరలో జరిగే ఐపీఎల్-2022 మెగా వేలంలో మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. లక్నో టీంకు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇదిలాఉండగా.. ఈ ఫ్రాంచైజీ ట్విట్టర్ లో తన పాత పేరును మార్చి నయా నేమ్ తో ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఇదే సంజీవ్ గొయెంకా ఐపీఎల్ లో పూణె సూపర్ జెయింంట్స్ పేరుతో ఓ జట్టును కొనుగోలు చేసి తర్వాత దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో ఇప్పుడు ఆ పేరును మార్చారు. దానిని ‘లక్నో సూపర్ జెయింట్స్’గా మార్చారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.