Lucknow Defeat Punhab : ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)మరో విజయం సాధించింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది.
Lucknow Defeat Punhab : ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)మరో విజయం సాధించింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లక్నో జట్టులో క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు.
లక్నోకు ఓపెనర్లు రాహుల్, డికాక్ లు శుభారంభం చేయలేకపోయారు. రబడ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన రాహుల్.. అదే ఓవర్లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, క్వింటన్ డికాక్ జట్టును ఆదుకున్నారు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో వీరిద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబడతో పాటు రాహుల్ చహర్ కూడా రాణించాడు. చహర్ 2 వికెట్లు తీశాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.