హోమ్ /వార్తలు /క్రీడలు /

Royal Challengers Bangalore : ఈ సారి కప్పు ఆర్సీబీదే.. అదృష్టం వారి వెంటే.. ఇదిగో సాక్ష్యాలివే..!

Royal Challengers Bangalore : ఈ సారి కప్పు ఆర్సీబీదే.. అదృష్టం వారి వెంటే.. ఇదిగో సాక్ష్యాలివే..!

Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

Royal Challengers Bangalore : ఈ సారి కప్పు ఆర్సీబీదేనా? వరుస మ్యాచుల్లో అదృష్టం డుప్లెసిస్ సేన వెంటే ఉందా..? ఇదే అదృష్టం రాబోయే మ్యాచుల్లో కూడా తోడైతే ఆర్సీబీకి తిరుగుండదా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది. ఇక, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్‌ ఫోర్‌కు చేరేలా చేసింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians).అయితే, ఈ సారి ఆర్సీబీదే కప్ అంటున్నారు ఆ జట్టు అభిమానులు. ఆర్సీబీ ప్రయత్నాలకు అదృష్టం కూడా తోడైందని.. అందుకు ఇవే సాక్ష్యాలంటున్నారు. ఫ్యాన్స్ చూపే సాక్ష్యాలు ఏంటంటే..

అయితే.. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచులో గెలిచి తమ ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ‌కి అదృష్టం కూడా బాగానే మేలు చేసింది. కింగ్ కోహ్లీ (Virat Kohli) రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకోగా.. మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో బతికిపోయాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయ్.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రషీద్ ఖాన్ (Rashid Khan) వేసిన 15వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ అదృష్టం కొద్ది గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.రషీద్ ఖాన్ విసిరిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన గ్లేన్ మాక్స్‌వెల్.. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని మిస్సయ్యాడు.

అది కాస్త నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్‌ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్స్ ప్రకారం బెయిల్స్‌ కింద పడితేనే బ్యాటర్ ఔట్‌ అయినట్లు. వరుసగా రెండో వికెట్‌ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్‌ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు. కీపర్ మాథ్యూ వెడ్ తలపై చేతులు పెట్టుకుని కూర్చోగా.. బంతి కాస్త బౌండరీకి దూసుకెళ్లింది. ఈ అవకాశంతో చెలరేగిన మ్యాక్సీ.. తనదైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌లతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైనా.. దినేశ్ కార్తీక్‌తో కలిసి ఆర్సీబీని విజయతీరానికి చేర్చాడు. ఒకవేళ మాక్స్‌వెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి ఉంటే? ఆర్‌సీబీ ఒత్తిడికి లోనయ్యేది. ఫలితం వేరేలా ఉండేది. ఆ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు లక్ ఆర్సీబీ ఎంత ఫేవర్ చేసిందో.

ఇక, శనివారం ఢిల్లీ, ముంబైల మధ్య జరిగిన మ్యాచులో కూడా అదృష్టం ఆర్సీబీ వెంట ఉందనేలా కొన్ని ఘటనలు జరిగాయ్. నిన్న టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే వరకు కూడా మ్యాచ్ లో ఢిల్లీ జట్టే విజయం సాధించేలా కనిపించింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే సమయానికి ముంబై స్కోరు 3 వికెట్లకు 95 పరుగులు. 33 బంతుల్లో 65 పరుగులు సాధించాలి. పిచ్ స్లోగా ఉండటంతో బ్యాటింగ్ కష్టంగా ఉంది. శార్దుల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే టిమ్ డేవిడ్ బీట్ అయ్యాడు. బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అంతేకాకుండా ఎడ్జ్ తీసుకున్న సౌండ్ కూడా వచ్చింది.

కామెంట్రీ బాక్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అవుటనే అనుకున్నారు. అయితే అంపైర్ అవుటివ్వలేదు. దాంతో పంత్ DRSకు వెళ్తారని అంతా అనుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ పంత్ దగ్గరకు వచ్చి తీసుకో తీసుకో అంటూ పదే పదే చెప్పాడు. అయితే పంత్ DRSకు వెళ్లలేదు. కాసేపటికి టీవీ రీప్లేలో అది క్లియర్ గా ఎడ్జ్ అయినట్లు తేలింది.

ఇది కూడా చదవండి : కేన్ మామ లేడు.. మరి SRHని నడిపించేది ఎవరు.. రేసులో రూ. 10.75 కోట్ల ఆటగాడు..!

గోల్డెన్ డక్ గా వెనుదిరగాల్సిన టిమ్ డేవిడ్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి ముంబైని విజయానికి చేరువగా తెచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత మ్యాచ్ ను ముంబై నెగ్గింది. అలాగే.. డేవాల్డ్ బ్రెవిస్ క్యాచ్ ని కూడా రిషబ్ పంత్ మిస్ చేశాడు. ఇలా.. ప్రతిదీ కూడా ఆర్సీబీకి లక్ ఫ్యాక్టర్ లానే కన్పిస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అదృష్టం కూడా ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఆర్సీబీ వెంట ఉంటే ఈ సారి కప్పు తమ జట్టుదేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి.. ఆర్సీబీ కప్ కొట్టడానికి అదృష్టం మిగతా మ్యాచుల్లో ఎలా పనిచేస్తోందో వేచి చూడాలి.

First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు