Home /News /sports /

IPL 2022 LSG VS RR LIVE SCORES RAJASTHAN ROYALS WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN

LSG vs RR : కీలక పోరులో టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్.. రెండు మార్పులతో బరిలోకి.. ఒక మార్పుతో లక్నో

కేఎల్ రాహుల్ వర్సెస్ సామ్సన్ (PC : IPL)

కేఎల్ రాహుల్ వర్సెస్ సామ్సన్ (PC : IPL)

LSG vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా బ్రబోర్న్ వేదికగా మరికొద్ది సేపట్లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.

LSG vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా బ్రబోర్న్ వేదికగా మరికొద్ది సేపట్లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రాజస్తాన్ రాయల్స్ రెండు మార్పులను చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 7 విజయాలు ఐదు పరాజయాలతో 14 పాయింట్లతో ఉంది. అదే సమయంలో లక్నో జట్టు 12 మ్యాచ్ ల్లో 8 విజయాలు నాలుగు పరాజయాలతో 16 పాయింట్లతో ఉంది.

ఇది కూడా చదవండి : అద్భుతాన్ని ఆవిష్కరించిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి..

రెండు జట్లకూ కీలకమే

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాజస్తాన్ రాయల్స్, లక్నో జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖాయం అవుతుంది. అదే సమయంలో రాజస్తాన్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు ఆ జట్టు మరింత చేరువ అవుతుంది. రాజస్తాన్ గనుక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం అవుతాయి. ఇక ఈ మ్యాచ్ కోసం రాజస్తాన్ రెండు మార్పులు చేసింది.  రస్సీ వాన్ డెర్ డుస్సెన్ స్థానంలో జేమ్స్ నీషమ్ ను కుల్దీప్ సేన్ స్థానంలో ఒబెడ్ మెకాయ్ లను తుది జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో లక్నో కూడా ఒక మార్పు చేసింది. కరణ్ శర్మను పక్కన పెట్టిన ఆ జట్టు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను తుది జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం లక్నో 16 పాయింట్లతో రాజస్తాన్ 14 పాయింట్లతో లీగ్ టేబుల్లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.


తుది జట్లు

రాజస్తాన్ రాయల్స్

జాస్ బట్లర్, జైస్వాల్, సంజూ సామ్సన్ (కెప్టెన్), పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిధ్, యుజువేంద్ర చహల్, ఒబెడ్ మెకాయ్

లక్నోసూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినస్, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, అవేశ్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు