IPL 2022 LSG VS RR LIVE SCORES RAJASTHAN ROYALS PUT179 TARGET FOR LUCKNOW SUPERGAINTS SJN
LSG vs RR : తడబడి నిలబడ్డ రాజస్తాన్ రాయల్స్... లక్నో టార్గెట్ ఎంతంటే?
వికెట్ తీసిన ఆనందంలో లక్నో ప్లేయర్స్ (PC : IPL)
LSG vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరుగుతోన్న కీలక మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తడబడి నిలబడింది.
LSG vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరుగుతోన్న కీలక మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తడబడి నిలబడింది. బ్రబోర్న్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ ల ో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) రాణించారు. దాంతో రాజస్తాన్ పోరాడే స్కోరును లక్నో ముందు ఉంచగలిగింది. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్ ల్లో పెద్దగా రాణించని జాస్ బట్లర్ (2) మరోసారి నిరాశ పరిచాడు. అయితే క్రీజులోకి వచ్చిన సంజూ సామ్సన్ మరో ఓపెనర్ జైస్వాల్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో రాజస్తాన్ స్కోరు బోర్డు పరుగెత్తింది. రెండో వికెట్ కు ఈ జోడీ 64 పరుగులు జోడించింది. షాట్ కు ప్రయత్నించిన సంజూ సామ్సన్ దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవలియన్ కు చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పడిక్కల్ కూడా దూకుడు కనబరిచాడు. 200కు పైగా స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. దాంతో రాజస్తాన్ 200 మార్కును సులభంగా దాటుతుందని అందరూ అనుకున్నారు. అయితే బదోని జైస్వాల్ ను ఆ తర్వాత బిష్ణోయ్ పడిక్కల్ ను అవుట్ చేయడంతో రాజస్తాన్ స్కోరు బోర్డు వేగం తగ్గింది. చివర్లో రియాన్ పరాగ్ (19), జేమ్స్ నీషమ్ (14) ఆడటంతో రాజస్తాన్ 178 స్కోరును అందుకోగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.