IPL 2022 LSG VS RCB LIVE SCORE LUCKNOW SUPERGIANTS WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN
IPL 2022 - RCB vs LSG : టాస్ లక్నోదే.. డీకే కోసం ప్రత్యేక వ్యూహం.. మార్పులు లేకుండానే బరిలోకి రెండు జట్లు
లక్నో వర్సెస్ బెంగళూరు (PC: IPL)
IPL 2022 - RCB vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో మరికాసేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయిట్స్ (lucknow supergiants) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) టాస్ నెగ్గాడు.
IPL 2022 - RCB vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో మరికాసేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయిట్స్ (lucknow supergiants) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) టాస్ నెగ్గాడు. టాస్ నెగ్గిన రాహుల్ మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు కూడా తమ ఆఖరి మ్యాచ్ ల్లో విజయాలు సాధించడంతో ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నాయి. రెండు జట్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ కావాలనే ఉద్దేశంలో రెండు జట్లు కూడా ఉన్నాయి. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ సీజన్ లో రెండు జట్లు కూడా మంచి ఆటతీరును కనబరుస్తున్నాయి. రెండు జట్లు కూడా ఆడిన 6 మ్యాచ్ ల్లోనూ నాలుగేసి విజయాలు రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ విషయంలో లక్నో జట్టు బెంగళూరు కంటే కూడా మెరుగ్గా ఉంది. దాంతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఆర్సీబీ ఉంది.
కలవర పెడుతోన్న కోహ్లీ
విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీని కలవరపెడుతుంది. తన స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్ లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక ఫాఫ్ డుప్లెసిస్, అనుజ్ రావత్ లు కూడా గత మ్యాచ్ లో పెద్దగా ఆడలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా దినేశ్ ఫినిషర్ రోల్ కు 100 శాతం న్యాయం చేస్తున్నాడు. బౌలింగ్ లో హర్షల్ పటేల్, హేజల్ వుడ్ మరోసారి కీలకం కానున్నారు. సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకుంటునే ఉన్నాడు. అతడు ఈ మ్యాచ్ ద్వారా అయినా ఫామ్ లోకి రావాలని అభిమానులు చూస్తున్నారు. ఇక లక్నో విషయానికి వస్తే కేఎల్ రాహుల్ గత మ్యాచ్ లో శతకంతో రాణించాడు. ఇక బౌలింగ్ కూాడా పటిష్టంగానే కనిపిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు సూపర్ షో అందించడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.