Home /News /sports /

IPL 2022 LSG VS PBKS PUNJAB KINGS BOWLERS SANDEEP SHARMA APPRECIATE QUINTON DE KOCK FOR HIS GESTURE SJN

IPL 2022 : డికాక్ ను చూసి చాలా మంది క్రికెటర్లు బుద్ధి తెచ్చుకోవాల్సిందే..!

క్వింటన్ ను అభినందిస్తోన్న సందీప్ శర్మ (PC: TWITTER)

క్వింటన్ ను అభినందిస్తోన్న సందీప్ శర్మ (PC: TWITTER)

IPL 2022 : దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ (quinton de kock) ఇతర క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ (Punjab KIngs)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) ఓపెనర్ క్వింటన్ డికాక్ చేసిన ఒక పని అతడిని అందరూ శభాష్ అనేలా చేస్తోంది.

ఇంకా చదవండి ...
IPL 2022 : దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ (quinton de kock) ఇతర క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ (Punjab KIngs)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) ఓపెనర్ క్వింటన్ డికాక్ చేసిన ఒక పని అతడిని అందరూ శభాష్ అనేలా చేస్తోంది. క్రికెట్ ను ఎందుకు జెంటిల్ మెన్ గేమ్ అంటారో మరోసారి క్వింటన్ డికాక్ ప్రపంచానికి చాటాడు. క్రికెట్ లో DRS అందుబాటులోకి రావడంతో అవుట్ విషయంలో ఇంతకుముందులా టీమ్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వేళ అవుట్ ను ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించినా..  ప్రత్యర్థి టీం DRSకి వెళ్లి ఖచ్చితమైన నిర్ణయాన్ని సాధించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : వారెవ్వా వాట్ ఏ క్యాచ్.. సూపర్ క్యాచ్ తో మెరిసిన రాహుల్.. వీడియో వైరల్

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ (6) తక్కువ స్కోరుకే అవుటైనా జట్టును నడిపించాడు. 46 పరుగులు చేసి అర్ధ సెంచరీ వైపు సాగాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ ను సందీప్ శర్మ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని డికాక్ కట్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో సందీప్ శర్మతో పాటు టీం మొత్తం అవుట్ కోసం అప్పీల్ చేసింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటించాడు. కానీ, క్వింటన్ డికాక్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోకుండా తనకు తానుగా పెవిలియన్ వైపు నడిచాడు. డికాక్ నిజాయితీకి అక్కడే ఉన్న సందీప్ శర్మ కూడా మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.



ఇలాంటి సంఘటనే ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ల్లో జరిగింది. సన్ రైజర్స్ హైదరాాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ కూడా క్వింటన్ డికాక్ లాంటి స్థితిలోనే నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ వేసిన బంతిని బట్లర్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ కు తగిలి కీపర్ క్యాచ్ చేతిలో చేరింది. అయితే అంపైర్ అవుట్ గా ప్రకటించలేదు. అదే సమయంలో తన బ్యాట్ కు తగిలిందనే విషయం తెలిసినా బట్లర్ మైదానాన్ని వీడలేదు. అయితే DRSకి వెళ్లిన కేన్ విలియమ్సన్ అక్కడ విజయవంతం అయ్యాడు. ఇక పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Punjab kings, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు