Home /News /sports /

IPL 2022 LSG VS PBKS LIVE SCORES PUNJAB KINGS BOWLER KAGISO RABADA TAKES 4 WICKETS AGAINST LSG IN IPL 2022 SEASON SJN

LSG vs PBKS : లక్నోను రఫ్పాడించిన రబడ.. అయినా పంజాబ్ ముందు టఫ్ టోటల్

రబడ (PC : TWITTER)

రబడ (PC : TWITTER)

LSG vs PBKS : పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) ను పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన లక్నో సారథి కేఎల్ రాహుల్ (Kl rahul) (6) ఈ మ్యాచ్ లో మాత్రం నిరాశ పరిచాడు.

ఇంకా చదవండి ...
LSG vs PBKS : పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) ను పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన లక్నో సారథి కేఎల్ రాహుల్ (Kl rahul) (6) ఈ మ్యాచ్ లో మాత్రం నిరాశ పరిచాడు. కగిసో రబడ నాలుగు వికెట్లతో చెలరేగి లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టులో క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబడతో పాటు రాహుల్ చహర్ కూడా రాణించాడు. చహర్ 2 వికెట్లు తీశాడు.

ఇది కూడా చదవండి : ’అఫ్రిది ఒక అబద్ధాల కోరు.. నేను హిందువునని ద్వేషించేవాడు‘ సంచలన కామెంట్స్ చేసిన పాక్ మాజీ స్పిన్నర్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఓపెనర్లు రాహుల్, డికాక్ లు శుభారంభం చేయలేకపోయారు. రబడ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన రాహుల్.. అదే ఓవర్లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, క్వింటన్ డికాక్ జట్టును ఆదుకున్నారు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో వీరిద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. అయితే రబడ వేసిన బౌలింగ్ లో డికాక్ కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. అయితే వీరిద్దరూ అవుటయ్యాక లక్నో ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆశలు పెట్టుకున్న కృనాల్ పాండ్యా (7), స్టొయినస్ (1), ఆయుశ్ బదోని (4) హోల్డర్ (11) వెంట వెంటనే పెవిలియన్ కు చేరారు. దాంతో ఆ జట్టు పంజాబ్ ముందు భారీ స్కోరును ఉంచలేకపోయింది.

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, స్టొయినస్, దీపక్ హుడా,  ఆయుశ్ బదోని, హోల్డర్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మోహిసిస్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

పంజాబ్ కింగ్స్

మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Punjab kings, Shikhar Dhawan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు