IPL 2022 LSG VS MI LIVE SCORE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - LSG vs MI : టాస్ గెలిచిన ముంబై.. లక్నోకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..
IPL 2022 - MI vs LSG
IPL 2022 - LSG vs MI : ముంబై ఇండియన్స్ చావోరేవో పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్ లో ఇంతవరకు గెలుపు రుచి చూడని ముంబై.. ఈ మ్యాచులో కూడా ఓడిపోతే.. ప్లే ఆఫ్ రేస్ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టే.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా కాసేపట్లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. వరుస వైఫల్యాలతో చెత్త రికార్డును మూటగట్టుకున్న ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫామ్ లో ఉన్న అవేశ్ ఖాన్ గాయంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మోహ్సిన్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.
ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో చెత్త ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది. దీంతో, రోహిత్ సేనకు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే- ప్లే ఆఫ్ చేరే ఆశలు, అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం టోర్నమెంట్ రేస్ నుంచి తప్పుకోవడం పక్కా. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమవుతున్నారు. వరుసగా విఫలమవుతున్న ఈ ఇద్దరూ సత్తా చాటితే ముంబైకి తిరుగుండదు. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉన్నారు. ఈ ముగ్గురు మరోసారి రాణించాల్సి ఉంది.
ఇక, విండీస్ హిట్టర్ కీరన్ పొలార్డ్ మాత్రం ఫామ్ లేక నానా తంటాలు పడుతున్నాడు. పొల్లార్డ్ ఫ్లాప్ వల్ల ముంబై కష్టాలు పడుతోంది. హృతిక్ షోకీన్ ఫస్ట్ మ్యాచులో ఫర్వాలేదన్పించాడు. బౌలింగ్ లో బుమ్రా తప్ప మిగతావారు అంతగా రాణించడం లేదు. బుమ్రా కూడా పరుగులు కంట్రోల్ చేస్తున్నాడు కానీ.. వికెట్లు తీయలేకపోతున్నాడు. జైదేవ్ ఉనాద్కత్ వికెట్లు తీస్తున్నా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. గత మ్యాచులో డేనియల్ సామ్స్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. రిలే మెరిడిత్ గత మ్యాచులో ఆకట్టుకున్నాడు.
మరోవైపు, కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ దూకుడు మీద ఉంది. ఏడు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. డికాక్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా కీలకం కానున్నారు. జాసన్ హెల్డర్, కృనాల్ పాండ్యా వంటి ఆల్ రౌండర్లు వారి సొంతం. బౌలింగ్ లో కూడా ముంబై కన్నా లక్నో చాలా స్ట్రాంగ్ గా ఉంది. దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్‌లు ముంబైకి సవాల్ విసరనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.