హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs MI : రాహుల్ కా కమాల్.. మరో సెంచరీ బాదిన లక్నో కెప్టెన్.. ముంబై టార్గెట్ ఇదే..

IPL 2022 - LSG vs MI : రాహుల్ కా కమాల్.. మరో సెంచరీ బాదిన లక్నో కెప్టెన్.. ముంబై టార్గెట్ ఇదే..

కేఎల్ రాహుల్ ( IPL twitter)

కేఎల్ రాహుల్ ( IPL twitter)

IPL 2022 - LSG vs MI : మరోసారి తన ఫేవరెట్ జట్టుపై కేఎల్ రాహుల్ చెలరేగాడు. కళాత్మకమైన విధ్వంసంతో మరో సెంచరీ బాదాడు. దీంతో, లక్నో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ తో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 102 పరుగులు నాటౌట్ ; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి తన ఫేవరెట్ జట్టు మీద చెలరేగాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీశ్ పాండే (22 బంతుల్లో 22 పరుగులు ; 1 సిక్సర్) రాణించాడు. ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన లక్నో తమ ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరభించిది. ఫస్ట్ మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా ల‌ 20 ప‌రుగులు చేసింది. అయితే, డికాక్ రూపంలో లక్నోకి ఫస్ట్ షాక్ తగిలింది. 27 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 ప‌రుగులు చేసిన డికాక్.. బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ తర్వాత రాహుల్, మనీష్ పాండే ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించారు. ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు.

కేఎల్ రాహుల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పొలార్డ్ విడదీశాడు. 85 ప‌రుగుల వ‌ద్ద మ‌నీష్ పాండే(22) రూపంలో ల‌క్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. పొలార్డ్ బౌలింగ్‌లో మెరిడిత్ కి క్యాచ్ ఇచ్చి పాండే ఔట‌య్యాడు. ఆ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది లక్నో. మార్కస్ స్టొయినిస్ డానియల్ సామ్స్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. కృనాల్ పాండే (1) పరుగు చేసి పొలార్డ్ బౌలింగ్ లో హృతిక్ సోకీన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

దీంతో 103 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. కేఎల్ రాహుల్ మాత్రం తన బ్యాటింగ్ జోరు ఆపలేదు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మరో వైపు దీపక్ హుడా 10 పరుగులు చేసి మెరిడిత్ బౌలింగ్ లో బ్రెవిస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 121 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అయినా, కేఎల్ రాహుల్ తన జోరు ఆపలేదు. ఆఖర్లో బౌలర్ ఎవరైనా సరే తగ్గేదేలే అన్నట్టు సాగింది రాహుల్ బ్యాటింగ్. ఈ క్రమంలో 61 బంతుల్లో తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. తన సూపర్ ఇన్నింగ్స్ తో లక్నోకి మంచి టోటల్ అందించాడు.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొల్లార్డ్, హృతిక్ షోకీన్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, జస్‌ప్రీత్ బుమ్రా

లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్

First published:

Tags: IPL 2022, Jasprit Bumrah, Kieron pollard, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma

ఉత్తమ కథలు