LSG vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికొద్ది సేపట్లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాలి. అదే సమయంలో లక్నో కు కూడా ఈ మ్యాచ్ కీలకం. టాస్ నెగ్గిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్లోగా ఉండటంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం లక్నో మూడు మార్పులను చేసింది. దుష్మంత చమీర, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్యాలను తప్పించిన లక్నో జట్టు వారి స్థానాల్లో వోహ్రా, ఎవిన్ లూయిస్, గౌతంలను తుది జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో కేకేఆర్ ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ లో గాయపడ్డ రహానే స్థానంలో అభిజిత్ తోమర్ ను తుది జట్టులోకి తీసుకుంది.
ఇది కూడా చదవండి : అందుకే నిదానమే ప్రధానం అనేది.. తొందరపడి ఇప్పుడు జెర్సీలో తల దాచుకుంటే ఎలాగబ్బా?
ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా కీలకమే. లక్నో సూపర్ జెయింట్స్ 16 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఆ జట్టు రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. టాప్ 2లో నిలిచే జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉండటంతో లక్నో ఇందులో గెలిచి టాప్ 2లో నిలవాలని పట్టుదలగా ఉంది. రాజస్తాన్ తన తదుపరి మ్యాచ్ ను చెన్నైతో ఆడనుంది. అందులో రాజస్తాన్ గెలిస్తే ఆ జట్టుకు కూడా 18 పాయింట్లు లభిస్తాయి. దాంతో లక్నో కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇక కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లో గనుక కేకేఆర్ ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలకు నేటితో తెరపడనుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, వోహ్రా, మార్కస్ స్టోయినస్, జేసన్ హోల్డర్, గౌతం, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
కోల్ కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్, అభిజిత్ తోమర్, నితీశ్ రాణా,శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), స్యామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer