హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs KKR : డికాక్, హుడా, స్టొయినిస్ మెరుపులు.. కేకేఆర్ ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - LSG vs KKR : డికాక్, హుడా, స్టొయినిస్ మెరుపులు.. కేకేఆర్ ముందు ఫైటింగ్ టోటల్..

Lucknow Super Giants (IPL Twitter)

Lucknow Super Giants (IPL Twitter)

IPL 2022 - LSG vs KKR : మొదట్లో డికాక్, హుడా జోరు.. ఆఖర్లో స్టొయినిస్ హోరు.. ఫలితంగా మంచి స్కోరు సాధించింది లక్నో సూపర్ జెయింట్స్.

పుణె వేదికగా కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచులో లక్నో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఓ దశలో భారీ స్కోరు దిశగా సాగిన లక్నో ఇన్నింగ్స్.. మిడిల్ ఓవర్లలో తడబడింది. అయితే.. ఆఖర్లో స్టొయినిస్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) , దీప‌క్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టొయినిస్ (14 బంతుల్లో 28 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సౌథీ, నరైన్, శివమ్ మావీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నోకు తొలి ఓవ‌ర్లోనే భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే ర‌నౌట‌య్యాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత‌మైన డైరెక్ట్ త్రోతో ల‌క్నో కెప్టెన్‌ను డైమండ్ డ‌క్‌గా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో.. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది లక్నో. అయితే, ల‌క్నో తొలి ఓవ‌ర్‌లోనే రాహుల్ వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ ఏమాత్రం త‌గ్గ‌కుండా కేకేఆర్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగింది. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడాతో కలిసి మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కేకేఆర్ బౌల‌ర్ల‌పై బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే లో 66 పరుగులు చేసింది లక్నో. ఇక, ల‌క్నో ఓపెన‌ర్ డికాక్ 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, డికాక్ దూకుడుకు నరైన్ బ్రేకులు వేశాడు. డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) న‌రైన్ బౌలింగ్‌లో శివ‌మ్ మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపు దీపక్ హుడా, కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించారు. అయితే.. భారీ స్కోర్ దిశ‌గా సాగుతున్న సమయంలో దీప‌క్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ర‌సెల్ బౌలింగ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

ఇక, అక్కడ నుంచి కోల్ కతా స్కోరు వేగం తగ్గింది. 27 బంతుల్లో 25 పరుగులు చేసిన కృనాల్ రస్సెల్ బౌలింగ్ లో ఫించ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక, ఆఖర్లో స్టొయినిస్, బదోని కాసేపు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. అయితే, లాస్ట్ రెండు ఓవర్లలో స్టొయినిస్ మెరుపులు మెరిపించడంతో లక్నో ఈ స్కోరు సాధించింది. ముఖ్యంగా.. శివమ్ మావి వేసిన 19 వ ఓవర్ లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి.. ఆ తర్వాత నాలుగో బంతికి శ్రేయస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన హోల్డర్ కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో.. 19 వ ఓవర్ లో 30 పరుగులు పిండుకుంది లక్నో జట్టు.

తుది జట్లు :

లక్నో సూపర్ జెయింట్స్‌ : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, శివమ్ మావి

First published:

Tags: Andre Russell, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer

ఉత్తమ కథలు