హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs KKR : టాస్ గెలిచిన శ్రేయస్.. KKRకి బిగ్ షాక్.. నిప్పులు చెరిగే బౌలర్ దూరం..

IPL 2022 - LSG vs KKR : టాస్ గెలిచిన శ్రేయస్.. KKRకి బిగ్ షాక్.. నిప్పులు చెరిగే బౌలర్ దూరం..

IPL 2022 - LSG vs KKR

IPL 2022 - LSG vs KKR

IPL 2022 - LSG vs KKR : ప్లే ఆఫ్ రేస్ లో నిలవడం కోసం కేకేఆర్ పోరాటం.. ఈ మ్యాచులో గెలిచి టాప్ ప్లేస్ దక్కించుకోవాలని లక్నో ఆరాటం.. ఈ నేపథ్యంలో మరో హోరాహోరీ పోరు ఖాయం.

ఐపీఎల్‌ 2022 సీజన్‌‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కాసేపట్లో జరగనుంది. ప్లే ఆఫ్ రేస్ లో ముందు నిలవడం కోసం లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో గెలిస్తే గుజరాత్‌తో సమానంగా నిలుస్తుందీ కేఎల్ రాహుల్ టీమ్. ఇక, పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. అయితే, ఈ మ్యాచులో కేకేఆర్ కి బిగ్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఉమేష్ యాదవ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రానాని తుది జట్టులోకి తీసుకుంది. ఇక, గాయపడ్డ అవేశ్ ఖాన్ ని తిరిగి లక్నో జట్టుతో చేరాడు.

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ కొండంత బలం. ఈ సీజన్‌లో రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ ఊపు మీదున్నాడు. క్వింటన్ డికాక్ కూడా ఫర్వాలేదన్పిస్తున్నాడు.

మిడిలార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, లోయర్ ఆర్డర్‌లో జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్ సత్తా చాటుతున్నారు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యాలతో అటు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. జట్టు మొత్తం నిలకడగా రాణిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో కలిసికట్టుగా ఆడుతోంది. ఇదే ఊపుతో సత్తా చాటితే మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవచ్చు.

ఇక, ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫస్ట్ లో సత్తా చాటిన కేకేఆర్.. ఆ తర్వాత తడబడుతోంది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కటే. తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌ మొత్తం మీద నాలుగు విజయాలనే అందుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారినట్టే.

కేకేఆర్ జట్టులో ఫించ్ అనుకున్నంతగా రాణించడం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నా.. భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది. నితీష్ రాణా, రింకు సింగ్ లు మంచి టచ్ లో ఉన్నారు. రస్సెల్, నరైన్ తమ హిట్టింగ్ పవర్ చూపించాల్సి ఉంది. బౌలింగ్ లో ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, సునీల్ నరైన్ రాణిస్తున్నారు. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అయితే, ఉమేష్ యాదవ్ ఈ మ్యాచుకు దూరమవ్వడం వారి అవకాశాల్ని కచ్చితంగా దెబ్బతీసే ఛాన్సుంది.

తుది జట్లు :

లక్నో సూపర్ జెయింట్స్‌ : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, శివమ్ మావి

First published:

Tags: Andre Russell, Cricket, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer

ఉత్తమ కథలు