LSG vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ దంచి కొట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్ లో క్వింటన్ డికాక్ 70 బంతుల్లో 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) యాంకర్ రోల్ ప్లే చేశాడు. దాంతో లక్నో జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ కావడం విశేషం.
ఇది కూడా చదవండి : ఈ సీజన్ లో ధోని కంత సీన్ లేదు.! కెప్టెన్ కూల్ పై దుస్రా కింగ్ షాకింగ్ కామెంట్
టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఆరంభంలో ఆచి తూచి ఆడారు. కుదురుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకు తరలించాడు. క్వింటన్ ఆటను చూసిన కేఎల్ రాహుల్.. సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రోటేట్ చేయడానికే పరిమితం అయ్యాడు. వీరిద్దరిని విడదీయడానికి శ్రేయస్ అయ్యర్ పదే పదే బౌలింగ్ ను మార్చేడే తప్ప సక్సెస్ మాత్రం అవ్వలేదు. పవర్ ప్లేలో కేవలం 44 పరుగులు మాత్రమే సాధించిన రాహుల్, క్వింటన్ డికాక్ ద్వయం. డెత్ ఓవర్స్ లో మాత్రం చెలరేగిపోయారు. ఏకంగా 88 పరుగులు పిండుకున్నారు. క్వింటన్ ధాటికి ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ ఓవర్ కు 15 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. డికాక్, రాహుల్ ధాటికి లక్నో జట్టు భారీ స్కోరును అందుకుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, వోహ్రా, మార్కస్ స్టోయినస్, జేసన్ హోల్డర్, గౌతం, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
కోల్ కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్, అభిజిత్ తోమర్, నితీశ్ రాణా,శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), స్యామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer