IPL 2022 LSG VS GT LIVE SCORES GUJARAT TITANS WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN
LSG vs GT : కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా.. మూడు మార్పులతో గుజరాత్.. ఒక మార్పుతో లక్నో
కేఎల్ రాహుల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా (PC : IPL)
LSG vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరే తొలి జట్టును తేల్చే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్ టాస్ గెలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow SuperGaints)తో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
LSG vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరే తొలి జట్టును తేల్చే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్ టాస్ గెలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow SuperGaints)తో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండు జట్లు కూడా 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ తో ఉన్న లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది.
మూడు మార్పులో గుజరాత్
గత రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఏకంగా మూడు మార్పులను చేసింది. లూకీ ఫెర్గ్యూసన్, ప్రదీప్ సంగ్వాన్, సుదర్శన్ లను తుది జట్టు నుంచి తప్పించిన గుజరాత్ వారి స్థానాల్లో మ్యాథ్యూవేడ్, సాయి కిషోర్, యశ్ దయాల్ లను తీసుకుంది. ఇక లక్నో కూడా ఒక మార్పు చేసింది. రవి బిష్ణోయ్ స్థానంలో యూపీ రంజీ జట్టు కెప్టెన్ కరణ్ శర్మ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.