IPL 2022 LSG VS GT LIVE SCORES GUJARAT TITANS FAILED TO PUT MASSIVE TARGET FOR LUCKNOW SUPERGAINTS SJN
GT vs LSG : తప్పిన హార్దిక్ పాండ్యా లెక్క.. శుబ్ మన్ గిల్ పోరాటం చేసినా.. లక్నో ముందు ఈజీ టార్గెట్
హార్దిక్, కేఎల్ రాహుల్ (PC : IPL)
GT vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (gujarat Titans) బ్యాటర్ విఫలమయ్యారు.
GT vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (gujarat Titans) బ్యాటర్ విఫలమయ్యారు. ఓపెనర్ శుబ్ మన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆడలేకపోయారు. దాంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. దాంతో బంతి బ్యాట్ పైకి సరిగ్గా రాలేదు. పిచ్ ను సమర్థంగా ఉపయోగించుకున్న లక్నో పేసర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. మోసిన్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో వికెట్ సాధించారు.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ స్లోగా ఉండటంతో పరుగులు సాధించేందుకు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తీవ్రంగా కష్టపడ్డారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా (5), వేడ్ (10) వికెట్లను కోల్పోయింది. ఆశలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా (11) కూడా నిరాశ పరిచాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ కు తగ్గట్టు ఆడిన అతడు సీజన్ లో మరో అర్ధ సెంచరీని అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ (26; 1 ఫోర్ ,1 సిక్స్) రాణించాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కనబర్చడంతో గుజరాత్ స్కోరు 140 మార్కును దాటగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.