హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఇనాళ్లు ఎక్కడున్నావయ్యా... లక్నో సూపర్ జెయింట్స్ ను నిలబెట్టిన బదోని, హుడా

IPL 2022: ఇనాళ్లు ఎక్కడున్నావయ్యా... లక్నో సూపర్ జెయింట్స్ ను నిలబెట్టిన బదోని, హుడా

IPL 2022: ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డక్. ఆ తర్వాత కాసేపటికే క్వింటన్ డికాక్ (7) అవుట్... ఎవిన్ లూయిస్ (10), మనీశ్ పాండే (6) అలా వచ్చి ఇలా వెళ్లారు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇంకా చదవండి ...

IPL 2022:  ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డక్. ఆ తర్వాత కాసేపటికే క్వింటన్ డికాక్ (7) అవుట్... ఎవిన్ లూయిస్ (10), మనీశ్ పాండే (6) అలా వచ్చి ఇలా వెళ్లారు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక షమీ బౌలింగ్ దూకుడును చూస్తే లక్నో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానాలు ఫ్యాన్స్ మదిలో మెదిలాయి. అయితే అనంతరం అద్భుతం జరిగింది. పెద్దగా ఆశలు లేని ఇద్దరు ప్లేయర్స్ సూపర్ బ్యాటింగ్ తో లక్నోను నిలబెట్టారు. ఇప్పుడిప్పుడే టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకుంటున్న దీపక్ హుడా, ఎవరికీ తెలియన్ ఆయుశ్ బదోని అద్భుత ఆటతీరుతో లక్నోను ఆదుకున్నారు. దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్ బదోని (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరు పోరాడటంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా... వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీశాడు. మరో వికెట్ ను రషీద్ ఖాన్ అందుకున్నాడు.

29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీంను దీపక్ హుడా, ఆయుశ్ బదోనిలు ఆదుకున్నారు. మొదట జాగ్రత్తగా ఆడిన వీరు... ఆ తర్వాత రెచ్చిపోయారు. తొలి 10 ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రమే చేసిన లక్నో.. ఆ తర్వాత 10 ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఐదో వికెట్ కు హుడా, బదోని కలిసి 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు అందుకున్నారు. చివర్లో కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో లక్నో 150 మార్కును అందుకుంది.

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, మనీశ్ పాండే, లూయిస్, బదోని, హుడా, కృనాల్ పాండ్యా, మొహ్ సిన్, బిష్ణోయ్, చమీర, అవేశ్ ఖాన్

గుజరాత్ టైటాన్స్

గిల్, వేడ్, మిల్లర్, శంకర్, హార్దిక్, మనోహర్, తెవాటియా, రషీద్ ఖాన్, వరుణ్ అరోన్, ఫెర్గూసన్, షమీ

First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rashid Khan

ఉత్తమ కథలు