హోమ్ /వార్తలు /క్రీడలు /

Gautam Gambhir : ఆవేశంతో ఊగిపోయిన గౌతం గంభీర్.. కారణం అదేనా? వీడియో వైరల్

Gautam Gambhir : ఆవేశంతో ఊగిపోయిన గౌతం గంభీర్.. కారణం అదేనా? వీడియో వైరల్

గంభీర్ (PC : IPL)

గంభీర్ (PC : IPL)

Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) మరోసారి ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతకుముందు జరిగిన ఒక మ్యాచ్ లో ఊగిపోయిన అతడు.. తాజాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్ తర్వాత కూడా ఆవేశంతో డగౌట్ లో ఊగిపోయాడు.

ఇంకా చదవండి ...

Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) మరోసారి ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతకుముందు జరిగిన ఒక మ్యాచ్ లో ఊగిపోయిన అతడు.. తాజాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్ తర్వాత కూడా ఆవేశంతో డగౌట్ లో ఊగిపోయాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని కుల్దీప్ యాదవ్ భారీ సిక్సర్ బాదాడు. అయితే అనంతరం స్టొయినస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో లక్నో గెలిచిన తర్వాత అంతసేపు కామ్ గా కూర్చోన్న గౌతీ ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. ఎస్.. ఎస్.. మనం గెలిచాం అంటూ పక్కనే ఉన్న విజయ్ దహియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : వాట్ ఏ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర ఢిల్లీ ప్లేయర్ అద్భుత విన్యాసం..

196 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్ మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడినా ఢిల్లీకి గెలుపును మాత్రం అందించలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా లీగ్ లో లక్నో 6వ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది 5వ ఓటమి కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో  3 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. లక్నో సారథి కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52;  6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. దాంతో లక్నో భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచగలిగింది. చివర్లో మార్కస్ స్టొయినస్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో లక్నో జట్టు 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.

టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ రాగా.. తొలి బంతినే ఫోర్ బాదిన డికాక్ లక్నోకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా డికాక్ క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. డికాక్ అవుటయ్యాక దీపక్ హుడా క్రీజులోకి రగా.. ఇక్కడి నుంచి రాహుల్ దూకుడు మొదలైంది. మరో ఎండ్ లో ఉన్న హుడా కూడా ఢిల్లీ బౌలర్లను ఉతకడం మొదలు పెట్టాడు. దాంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది .వీరిద్దరూ రెండో వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత హుడా అవుటవ్వగా.. లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ కు రాహుల్ కూడా పెవిలియన్ కు చేరాడు. చివర్లో స్టొయినస్ కూడా ఆడటంతో లక్నో భారీ స్కోరును సాధించింది. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, Gautam Gambhir, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు