హోమ్ /వార్తలు /క్రీడలు /

LSG vs DC : టాస్ లక్నోదే.. గాయంతో స్టార్ బౌలర్ అవుట్.. మార్పుల్లేకుండానే ఢిల్లీ క్యాపిటల్స్

LSG vs DC : టాస్ లక్నోదే.. గాయంతో స్టార్ బౌలర్ అవుట్.. మార్పుల్లేకుండానే ఢిల్లీ క్యాపిటల్స్

పంత్ వర్సెస్ రాహుల్ (PC : IPL)

పంత్ వర్సెస్ రాహుల్ (PC : IPL)

LSG vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా వాంఖడే వేదికగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ నెగ్గిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...

LSG vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా వాంఖడే వేదికగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ నెగ్గిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం లక్నో జట్టు ఒక మార్పు చేసింది. గాయంతో బాధపడుతున్న అవేశ్ ఖాన్ కు విశ్రాంతి ఇచ్చిన లక్నో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతం ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇక ఈ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ’కోహ్లీ ఆ కోరికను అదుపు చేసుకోవాలి.. అప్పుడే రాణిస్తాడు‘ రన్ మిషీన్ పై 1983 ప్రపంచకప్ హీరో ఆసక్తికర వ్యాఖ్య

ఉత్సాహంలో రెండు జట్లు

గత మ్యాచ్ లో అటు రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, ఇటు కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్లు విజయాలు సాధించడంతో ఉత్సాహంతో ఉన్నాయి. నేటి మ్యాచ్ లో రెండు జట్లు కూడా గెలుపు ప్రధాన లక్ష్యంతో బరిలోకి దిగనున్నాయి. లక్నో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 6 విజయాలు మూడు పరాజయాలతో 12 పాయింట్లు సాధించి గ్రూప్ లో మూడో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే 8 మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో విజయం మరో నాలుగింటిలో పరాజయాలను నమోదు చేసి 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే లక్నో కంటే కూడా ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గనుక ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బలాబలాల విషయానికి వస్తే రెండు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. డేవిడ్ వార్నర్, రోవ్ మన్ పావెల్ దూకుడుగా ఆడుతున్నారు. అయితే రిషభ్ పంత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇక లక్నోలో కేఎల్ రాహుల్ మంచి టచ్ లో ఉన్నాడు. డికాక్ ,హూాడా, పాండ్యా కూడా బాగానే ఆడుతున్నారు. అయితే హిట్టర్ స్టొయినస్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడం లేదు. ఈ మ్యాచ్ లో మాత్రం లక్నో జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

ఇది కూడా చదవండి : బర్త్ డే రోజు భార్యను ఏడిపించిన రోహిత్ శర్మ.. ఓదార్చిన అశ్విన్ భార్య.. అసలేం జరిగిందంటే?

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినస్, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మోసిన్ ఖాన్, కృష్ణప్ప గౌతం, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

ఢిల్లీ క్యాపిటల్స్

డేవిడ్ వార్నర్, షా, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రావ్ మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, IPL, KL Rahul, Lucknow Super Giants, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు