హోమ్ /వార్తలు /క్రీడలు /

LSG vs DC : ఆఖరి ఓవర్లో కుల్దీప్ సిక్సర్ బాదినా.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో లక్నోదే విక్టరీ..

LSG vs DC : ఆఖరి ఓవర్లో కుల్దీప్ సిక్సర్ బాదినా.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో లక్నోదే విక్టరీ..

పంత్ క్లీన్ బౌల్డ్ (PC : IPL)

పంత్ క్లీన్ బౌల్డ్ (PC : IPL)

LSG vs DC : నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)పై లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) అద్భుత విజయాన్ని సాధించింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ గెలవాలంటే 21 పరుగులు కావాల్సిన తరుణంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బంతిని మార్కస్ స్టొయినస్ కు ఇచ్చాడు.

ఇంకా చదవండి ...

LSG vs DC : నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)పై లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) అద్భుత విజయాన్ని సాధించింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ గెలవాలంటే 21 పరుగులు కావాల్సిన తరుణంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బంతిని మార్కస్ స్టొయినస్ కు ఇచ్చాడు. స్టొయినస్ వేసిన తొలి బంతిని కుల్దీప్ యాదవ్ సిక్సర్ బాదాడు. దాంతో ఢిల్లీ విజయం సమీకరణం 5 బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతిని స్టొయినస్ వైడ్ గా వేశాడు. దాంతో ఢిల్లీ విజయం సమీకరణం 5 బంతులకు 14 పరుగులుగా మారిపోయింది. తీవ్ర ఒత్తడిలో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టొయినస్ ఆ తర్వాతి నాలుగు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆఖరి బంతిని అక్షర్ పటేల్ సిక్సర్ గా బాదినా అది ఢిల్లీని గెలిపించలేకపోయింది. చివరకు లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘనవిజయం సాధించింది.

196 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్ మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడినా ఢిల్లీకి గెలుపును మాత్రం అందించలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా లీగ్ లో లక్నో 6వ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది 5వ ఓటమి కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో  3 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. లక్నో సారథి కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52;  6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. దాంతో లక్నో భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచగలిగింది. చివర్లో మార్కస్ స్టొయినస్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో లక్నో జట్టు 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.

టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ రాగా.. తొలి బంతినే ఫోర్ బాదిన డికాక్ లక్నోకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా డికాక్ క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. డికాక్ అవుటయ్యాక దీపక్ హుడా క్రీజులోకి రగా.. ఇక్కడి నుంచి రాహుల్ దూకుడు మొదలైంది. మరో ఎండ్ లో ఉన్న హుడా కూడా ఢిల్లీ బౌలర్లను ఉతకడం మొదలు పెట్టాడు. దాంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది .వీరిద్దరూ రెండో వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత హుడా అవుటవ్వగా.. లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ కు రాహుల్ కూడా పెవిలియన్ కు చేరాడు. చివర్లో స్టొయినస్ కూడా ఆడటంతో లక్నో భారీ స్కోరును సాధించింది. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: David Warner, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Prithvi shaw, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు