హోమ్ /వార్తలు /క్రీడలు /

LSG vs GT : రాహుల్ చెడుగుడు.. హుడా ఉతుకుడు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసిన లక్నో

LSG vs GT : రాహుల్ చెడుగుడు.. హుడా ఉతుకుడు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసిన లక్నో

దీపక్ హుడా, రాహుల్ (PC : IPL)

దీపక్ హుడా, రాహుల్ (PC : IPL)

LSG vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) భారీ స్కోరును సాధించింది.

LSG vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) భారీ స్కోరును సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో  3 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. లక్నో సారథి కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52;  6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. దాంతో లక్నో భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచగలిగింది. చివర్లో మార్కస్ స్టొయినస్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో లక్నో జట్టు 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.

ఇది కూడా చదవండి : గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ.. కారణం ఇదేనా?

అంతకుముందు టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ రాగా.. తొలి బంతినే ఫోర్ బాదిన డికాక్ లక్నోకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా డికాక్ క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. డికాక్ అవుటయ్యాక దీపక్ హుడా క్రీజులోకి రగా.. ఇక్కడి నుంచి రాహుల్ దూకుడు మొదలైంది. మరో ఎండ్ లో ఉన్న హుడా కూడా ఢిల్లీ బౌలర్లను ఉతకడం మొదలు పెట్టాడు. దాంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది .వీరిద్దరూ రెండో వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత హుడా అవుటవ్వగా.. లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ కు రాహుల్ కూడా పెవిలియన్ కు చేరాడు. చివర్లో స్టొయినస్ కూడా ఆడటంతో లక్నో భారీ స్కోరును సాధించింది. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినస్, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మోసిన్ ఖాన్, కృష్ణప్ప గౌతం, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

ఢిల్లీ క్యాపిటల్స్

డేవిడ్ వార్నర్, షా, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రావ్ మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, IPL, IPL 2022, Kane Williamson, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Prithvi shaw, Ravindra Jadeja, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు