హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : వాట్ ఏ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర ఢిల్లీ ప్లేయర్ అద్భుత విన్యాసం..

IPL 2022 : వాట్ ఏ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర ఢిల్లీ ప్లేయర్ అద్భుత విన్యాసం..

లలిత్ యాదవ్ (PC : TWITTER)

లలిత్ యాదవ్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కళ్లు చెదిరే క్యాచ్ లను పట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే టిమ్ సౌతీ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడులు కళ్లు చెదిరే క్యాచ్ లను అందుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్లేయర్ లలిత్ యాదవ్ కూడా చేరాడు.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కళ్లు చెదిరే క్యాచ్ లను పట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే టిమ్ సౌతీ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడులు కళ్లు చెదిరే క్యాచ్ లను అందుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్లేయర్ లలిత్ యాదవ్ కూడా చేరాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో ఈ ఢిల్లీ ప్లేయర్ బౌండరీ లైన్ దగ్గర అద్బుత క్యాచ్ ను అందుకున్నాడు. 71 పరుగుల చేసి సెంచరీ వైపు దూసుకెళ్తోన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ను అతన సూపర్ క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు. శార్దుల్ ఠాకూర్ (Shardul Thakur) వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని రాహుల్ భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న లలిత్ యాదవ్ గాల్లోకి ఎగురుతూ సిక్సర్ వెళ్లే బంతిని అందుకున్నాడు. అనంతరం బౌండరీ లైన్ ను తాకకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. ఫలితంగా రాహుల్ పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి : గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ.. కారణం ఇదేనా?

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో  3 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. లక్నో సారథి కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52;  6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. దాంతో లక్నో భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచగలిగింది. చివర్లో మార్కస్ స్టొయినస్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో లక్నో జట్టు 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.

అంతకుముందు టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ రాగా.. తొలి బంతినే ఫోర్ బాదిన డికాక్ లక్నోకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా డికాక్ క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. డికాక్ అవుటయ్యాక దీపక్ హుడా క్రీజులోకి రగా.. ఇక్కడి నుంచి రాహుల్ దూకుడు మొదలైంది. మరో ఎండ్ లో ఉన్న హుడా కూడా ఢిల్లీ బౌలర్లను ఉతకడం మొదలు పెట్టాడు.

దాంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది .వీరిద్దరూ రెండో వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత హుడా అవుటవ్వగా.. లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ కు రాహుల్ కూడా పెవిలియన్ కు చేరాడు. చివర్లో స్టొయినస్ కూడా ఆడటంతో లక్నో భారీ స్కోరును సాధించింది. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు