హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs DC : డికాక్ వన్ మ్యాన్ షో.. లక్నో సూపర్ విక్టరీ.. ఢిల్లీ కొంపముంచిన స్టార్ బౌలర్..

IPL 2022 - LSG vs DC : డికాక్ వన్ మ్యాన్ షో.. లక్నో సూపర్ విక్టరీ.. ఢిల్లీ కొంపముంచిన స్టార్ బౌలర్..

IPL 2022 - LSG vs DC

IPL 2022 - LSG vs DC

IPL 2022 - LSG vs DC : ఓ దశలో లక్నో ఈజీగా గెలిచేలా కన్పించింది. అయితే, డికాక్ ఔట్ తర్వాత.. మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి మ్యాచ్ మీద ఆసక్తి పెంచారు.

  డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు జరిగిన ఉత్కంఠ పోరులో చివరికి విజయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ నే వరించింది. ఓ దశలో లక్నో ఈజీగా గెలిచేలా కన్పించింది. అయితే, డికాక్ ఔట్ తర్వాత.. మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి మ్యాచ్ మీద ఆసక్తి పెంచారు. అయితే, ముస్తఫిజుర్ రహ్మన్ వేసిన 19 ఓవర్ లో కృనాల్ పాండ్యా 14 పరుగులు పిండుకున్నాడు. దీంతో, ఆఖరి ఓవర్ లో 5 పరుగులు అవసరమయ్యాయ్. ఆఖరి ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని ఫోర్, సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ లక్నో సొంతమైంది. ఆయుష్ మూడు బంతుల్లో పది పరుగులు చేశాడు. దీంతో,ఆరు వికెట్ల తేడాతో 19.4 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది లక్నో.

  అంతకు ముందు.. డికాక్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. క్వింటన్ డికాక్ ( 52 బంతుల్లో 80 పరుగులు ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ను స్టార్ బౌలర్ అన్రిచ్ నోకియా కొంపముంచాడు. 2.2 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రెండు హై వేస్ట్ నో బాల్స్ వేసి.. ఢిల్లీని విజయానికి దూరం చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

  150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకి మంచి ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ మంచి స్టార్ట్ అందించారు. ముఖ్యంగా డికాక్ దూకుడైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఢిల్లీ స్టార్ బౌలర్ అన్రిచ్ నోకియాను టార్గెట్ చేసుకుని పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ వికెట్ కు ఈ ఇద్దరూ 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.

  అయితే, 24 పరుగులతో నిలకడగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, 73 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది లక్నో. ఆ తర్వాత వచ్చిన ఎవిన్ లూయిస్ కూడా అంతగా రాణించలేదు. 13 బంతులాడి.. 5 పరుగులు చేసిన లూయిస్ ని లలిత్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు.

  లలిత్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన లూయిస్ కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, మరో ఎండ్ లో తన ఆటతో ఆకట్టుకున్న డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా డికాక్ సూపర్ షాట్లు ఆడాడు. అయితే, డికాక్ జోరుకు కుల్దీప్ యాదవ్ బ్రేకులు వేశాడు. 80 పరుగులు చేసిన డికాక్.. సర్ఫరాజ్ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  ఇక, ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి మ్యాచ్ మీద ఆసక్తి పెంచారు. అయితే, ముస్తఫిజుర్ రహ్మన్ వేసిన 19 ఓవర్ లో కృనాల్ పాండ్యా 14 పరుగులు పిండుకున్నాడు. దీంతో, ఆఖరి ఓవర్ లో 5 పరుగులు అవసరమయ్యాయ్. ఆఖరి ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. 11 పరుగులు చేసిన దీపక్ హుడా అక్షర్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని ఫోర్, సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ లక్నో సొంతమైంది.

  అంతకు ముందు.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ 150 ప‌రుగుల మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో ఢిల్లీ ఓపెన‌ర్ పృథ్వీ షా సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ఓ ద‌శ‌లో ఆ జ‌ట్టు భారీ స్కోర్ సాధించేలా క‌నిపించింది. కానీ షా ఔట‌య్యాక ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధాటిగా న‌డిపించేవారే క‌రువయ్యారు. కెప్టెన్ రిష‌బ్ పంత్, స‌ర్ప‌రాజ్ ఖాన్ నాల్గో వికెట్‌కు అజేయంగా 75 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పిన‌ప్ప‌టికీ ధాటిగా ఆడ‌లేక‌పోయారు.

  ల‌క్నో బౌల‌ర్లు ఆవేష్ ఖాన్‌, జేస‌న్ హోల్డ‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు.పృథ్వీ షా ( 34 బంతుల్లో 61 పరుగులు ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (36 బంతుల్లో 39 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ ( 28 బంతుల్లో 36 పరుగులు ; 3 ఫోర్లు,) రాణించారు. లక్నో బౌలర్లలో యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్రిష్ణప్ప గౌతమ్ కి ఒక వికెట్ దక్కింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Delhi Capitals, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rishabh Pant

  ఉత్తమ కథలు