హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs DC : టాస్ లక్నోదే... ఢిల్లీ జట్టులోకి డేవిడ్ బాయ్ వచ్చేశాడు.. ఇక, పరుగుల వరదే..

IPL 2022 - LSG vs DC : టాస్ లక్నోదే... ఢిల్లీ జట్టులోకి డేవిడ్ బాయ్ వచ్చేశాడు.. ఇక, పరుగుల వరదే..

IPL 2022 - LSG vs DC

IPL 2022 - LSG vs DC

IPL 2022 - LSG vs DC : లక్నో మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. రెండింటి‌లో ఒకటి గెలిచిన ఢిల్లీ గెలుపు కోసం పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నోపై అద్భుత విజయాన్నందుకోగా.. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓటమిపాలైంది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022 సీజన్‌లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దుమ్మురేపుతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో.. మరో హోరాహోరీ పోరు ఖాయం. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మనీశ్ పాండే స్దానంలో జట్టులోకి స్పిన్ ఆల్ రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్ ను తీసుకుంది లక్నో. ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్, సర్ఫరాజ్ ఖాన్ అందుబాటులోకి వచ్చారు. ఇప్పటికే వార్నర్ క్వారంటైన్ పూర్తి చేసుకోగా.. నోర్జ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. డేవిడ్ వార్నర్ రాకతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్‌పై వేటు పడింది.

  పృథ్వీషాతో కలిసి వార్నర్ ఓపెనింగ్ చేయనున్నాడు. చాలా రోజుల తర్వాత వార్నర్ మళ్లీ ఢిల్లీకి ఆడుతుండటం ఆసక్తిగా మారింది. ఇన్నాళ్లు ముగ్గురు ఓవర్‌సీస్ ప్లేయర్లతో ఆడిన ఢిల్లీ.. అన్రిచ్ నోర్జ్ రాకతో పూర్తిస్థాయి కోటాతో ఆడనుంది. ఫామ్ లో లేని మన్ దీప్ సింగ్ ప్లేసులో సర్పరాజ్ ఖాన్ కు చోటు దక్కింది. లలిత్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ బరిలోకి దిగనున్నారు.

  మరోవైపు, కేఎల్ రాహుల్, డికాక్, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని వంటి ప్లేయర్లతో స్ట్రాంగ్ గా ఉంది. జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా వంటి టాప్ క్లాస్ ఆల్ రౌండర్లు లక్నో సొంతం. అవేశ్ ఖాన్ గత మ్యాచులో అద్భుతంగా రాణించాడు. యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సత్తా చాటితే లక్నోకు తిరుగుండదు. ఫామ్ లో లేని మనీశ్ స్థానంలో క్రిష్ణప్ప గౌతమ్ ను జట్టులోకి తీసుకుంది లక్నో.

  లక్నో మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. రెండింటి‌లో ఒకటి గెలిచిన ఢిల్లీ గెలుపు కోసం పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నోపై అద్భుత విజయాన్నందుకోగా.. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓటమిపాలైంది

  తుది జట్లు :

  లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, క్రిష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

  ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పోవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: David Warner, Delhi Capitals, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rishabh Pant

  ఉత్తమ కథలు