హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs DC : ఓన్లీ పృథ్వీ షో.. నిరాశపర్చిన వార్నర్.. లక్నో టార్గెట్ ఎంతంటే..

IPL 2022 - LSG vs DC : ఓన్లీ పృథ్వీ షో.. నిరాశపర్చిన వార్నర్.. లక్నో టార్గెట్ ఎంతంటే..

IPL 2022 - LSG vs DC : పృథ్వీ షా రాకింగ్ స్టార్ట్ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు.

IPL 2022 - LSG vs DC : పృథ్వీ షా రాకింగ్ స్టార్ట్ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు.

IPL 2022 - LSG vs DC : పృథ్వీ షా రాకింగ్ స్టార్ట్ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు.

  డివై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీ షా ( 34 బంతుల్లో 61 పరుగులు ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (36 బంతుల్లో 39 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ ( 28 బంతుల్లో 36 పరుగులు ; 3 ఫోర్లు,) రాణించారు. లక్నో బౌలర్లలో యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్రిష్ణప్ప గౌతమ్ కి ఒక వికెట్ దక్కింది.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కు అదిరిపోయే ఆరంభం లభించింది. యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీకి రాకింగ్ స్టార్ట్ అందించాడు. అతడు దూకుడు ముందు లక్నో బౌలర్లు తేలిపోయారు. పృథ్వీ షా దూకుడు ఎలా ఉందంటే.. అపోజిట్ లో ఉన్న వార్నర్ కూడా సైలెంట్ అయిపోయే అంతేగా. దొరికిన బంతి దొరికినట్టు బంతిని బౌండరీ తరలించాడు యంగ్ పృథ్వీ. ఈ క్రమంలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  అయితే, హాఫ్ సెంచరీ తర్వాత ఇంకా దూకుడుగా ఆడాలకున్న పృథ్వీ షా జోరుకు బ్రేకులు వేశాడు కృష్ణప్ప గౌతమ్. ఢిల్లీ క్యాపిటల్స్‌ పృథ్వీ షా(61) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో పృథ్వీ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఉన్నంతసేపు మాత్రం పృథ్వీ షా ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే, పృథ్వీ షా ఔట్ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది.4 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌ రవి బిష్ణోయి బౌలింగ్‌లో ఆయుష్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ కాసేపటికే.. రవి బిష్ణోయి బౌలింగ్‌లో రోవ్‌మెన్‌ పావెల్‌(3) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో, 74 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

  అయితే, ఆ తర్వాత కొంచెం సేపు పంత్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు. 15 వ ఓవర్ తర్వాత నుంచి తన దూకుడు మొదలుపెట్టాడు పంత్. మరో యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి స్కోరు బోర్డుకు వేగం అందించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, ఆఖర్లో కావాల్సినంత మెరుపులు రాకపోవడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోరుకు పరిమితమైంది.

  తుది జట్లు :

  లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, క్రిష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

  ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పోవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

  First published:

  Tags: Delhi Capitals, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Prithvi shaw, Rishabh Pant

  ఉత్తమ కథలు