హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : ’కళ్లు దొబ్బాయా? అలా ఎలా ఔటిస్తారు‘ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్

IPL 2022 : ’కళ్లు దొబ్బాయా? అలా ఎలా ఔటిస్తారు‘ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్

వార్నర్ క్యాచ్ (PC : TWITTER)

వార్నర్ క్యాచ్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన అంపైర్లు తాజాగా మరోసారి చెత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అది కూడా ఫీల్డ్ అంపైర్ కాదు.. థర్డ్ అంపైర్.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన అంపైర్లు తాజాగా మరోసారి చెత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అది కూడా ఫీల్డ్ అంపైర్ కాదు.. థర్డ్ అంపైర్. ఆదివారం మధ్యాహ్నం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఈ తప్పుడు నిర్ణయానికి బలైయ్యాడు. లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతిని లెగ్ సైడ్ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న ఆయుశ్ బదోని తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ ను అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : ఆవేశంతో ఊగిపోయిన గౌతం గంభీర్.. కారణం అదేనా? వీడియో వైరల్

అయితే ఫీల్డ్ అంపైర్లకు అది క్లీన్ క్యాచా? లేదా అనే అనుమానం రావడంతో థర్డ్ అంపైర్ కు నివేదించారు. థర్డ్ అంపైర్ టీవీ రీప్లేలో పలు మార్లు పరిశీలించాడు. ఆయుశ్ బదోని క్యాచ్ అందుకునే దాని కంటే కూడా ముందే బంతి నేలను తాకినట్లు కనిపించింది. అయితే బదోని వేళ్లు బంతి కింద ఉన్నాయనే ఉద్దేశంతో థర్డ్ అంపైర్ వార్నర్ ను అవుట్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మ్యాచ్ చూసిన అభిమానులు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా లో క్లాస్ అంపైరింగ్ అంటూ కూడా చివాట్లు పెడుతున్నారు.

థ్రిల్లర్ మ్యాచ్ లో ఓడిన ఢిల్లీ

నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ గెలవాలంటే 21 పరుగులు కావాల్సిన తరుణంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బంతిని మార్కస్ స్టొయినస్ కు ఇచ్చాడు. స్టొయినస్ వేసిన తొలి బంతిని కుల్దీప్ యాదవ్ సిక్సర్ బాదాడు. దాంతో ఢిల్లీ విజయం సమీకరణం 5 బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతిని స్టొయినస్ వైడ్ గా వేశాడు. దాంతో ఢిల్లీ విజయం సమీకరణం 5 బంతులకు 14 పరుగులుగా మారిపోయింది. తీవ్ర ఒత్తడిలో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టొయినస్ ఆ తర్వాతి నాలుగు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆఖరి బంతిని అక్షర్ పటేల్ సిక్సర్ గా బాదినా అది ఢిల్లీని గెలిపించలేకపోయింది. చివరకు లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘనవిజయం సాధించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, Delhi Capitals, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు