Home /News /sports /

IPL 2022 KRUNAL PANDYA DROPPED CATCH LSG ALL ROUNDER KRUNAL PANDYA ROASTED BY LUCKNOW SUPERGIANTS FANS SJN

IPL 2022: అడ్డంగా బుక్ అయిన కృనాల్ పాండ్యా... అంతా నీ వల్లే అంటూ లక్నో ఫ్యాన్స్ ఫైర్..

కృనాల్ పాండ్యా క్యాచ్ డ్రాప్ (PC: TWITTER)

కృనాల్ పాండ్యా క్యాచ్ డ్రాప్ (PC: TWITTER)

IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) పాలిట విలన్ గా కృనాల్ పాండ్యా (krunal Pandya) మారాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఇంకా చదవండి ...
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) పాలిట విలన్ గా కృనాల్ పాండ్యా (krunal Pandya) మారాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా చేసిన ఓ తప్పు ఏకంగా లక్నో విజయంపైనే ప్రభావం చూపింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్... ఒక దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో వికెట్ పడితే రాజస్తాన్ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా మారేది. అయితే కృనాల్ పాండ్యా అది జరగకుండా చేశాడు. లక్నో తరఫున ఆడుతూ తన చెత్త ఫీల్డింగ్ తో తన జట్టుకే గోతులు తవ్వాడు.

13 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ స్కోరు బోర్డు 4 వికెట్లకు 84 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 6.46 రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వస్తోంది. ఆ దశలో క్రీజులో హెట్ మైర్ మాత్రమే భారీ షాట్లు ఆడగల ప్లేయర్. 14వ ఓవర్ వేయడానికి కృష్ణప్ప గౌతం రాగా... అతడు వేసిన రెండో బంతిని హెట్ మైర్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ సరిగ్గా టైమ్ కాకపోవడంతో బంతి లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తోన్న కృనాల్ పాండ్యా వద్దకు వెళ్లింది. అది చాలా ఈజీ క్యాచ్ అవ్వడంతో హెట్ మైర్ కూడా అనవసరపు షాట్ ఆడానే అంటూ తనను తాను నిందించుకున్నాడు కూడా. అయితే కృనాల్ పాండ్యా రివర్స్ కప్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేస్తూ ఈజీ క్యాచ్ ను జారవిడిచాడు. ఆ సమయంలో హెట్ మైర్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.



ఇది కూడా చదండి :  కపిల్ దేవ్ క్యాచ్ ను గుర్తు చేసిన శార్దుల్ ఠాకూర్... వెనక్కి పరుగెడుతూ సూపర్ క్యాచ్... వీడియో వైరల్

కృనాల్ పాండ్యా లైఫ్ ఇవ్వడంతో బతికిపోయిన హెట్ మైర్ అనంతరం చెలరేగిపోయాడు. 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో రాజస్తాన్ జట్టు ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్ ను ఉంచగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో లక్నో ఫ్యాన్స్ కృనాల్ పాండ్యా ను సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తున్నారు. ’నీ వల్లే ఓడిపోయాం‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ఫ్యాన్స్ కృనాల్ పాండ్యా గతంలో చేసిన కొన్ని తప్పులను ఎత్తి చూపడం మొదలు పెడుతున్నారు. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతర ఫీల్డర్లు ఎవరైనా క్యాచ్ లను డ్రాప్ చేయడం లేదా మిస్ ఫీల్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కృనాల్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ’ఇప్పుడు ఏమంటావ్ కృనాల్‘ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఏదైతేం ఈ మ్యాచ్ మాత్రం కృనాల్ పాండ్యాకు పీడకల వంటిది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Lucknow Super Giants, Rajasthan Royals

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు