హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: గర్ల్ ఫ్రెండ్ ముందు పరువు పోగొట్టుకున్న కేఎల్ రాహుల్... అసలేం జరిగిందంటే?

IPL 2022: గర్ల్ ఫ్రెండ్ ముందు పరువు పోగొట్టుకున్న కేఎల్ రాహుల్... అసలేం జరిగిందంటే?

రాహుల్, అతియా శెట్టి (PC: TWITTER)

రాహుల్, అతియా శెట్టి (PC: TWITTER)

IPL 2022: క్రికెట్ లో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఎంతటి విధ్వంసకర ఆటగాడో మనకు తెలిసిన విషయమే. అటు టీమిండియా (Team India)కు ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ లను ఆడిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

IPL 2022: క్రికెట్ లో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఎంతటి విధ్వంసకర ఆటగాడో మనకు తెలిసిన విషయమే. అటు టీమిండియా (Team India)కు ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ లను ఆడిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు ద్వారా ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన రాహుల్... అనంతరం అద్భుత ఆటతీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఆపై గత రెండు సీజన్లకు పంజాబ్ కింగ్స్ (Punjab Kings)కు కెప్టెన్ గా వ్యవహరించిన అతడు... తాజా ఐపీఎల్ లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants)కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ సీజన్ లో బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ గా నిరాశ పరిచిన రాహుల్... అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో అలరించాడు. గత రెండు మ్యాచ్ ల్లోనూ రాహుల్ అదరగొట్టడంతో... రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి స్టేడియానికి వచ్చింది. అయితే కేఎల్ రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ముందు జీరోగా మిగిలి పరువు పోగొట్టుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఉంచిన టార్గెట్ ను ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన లక్నో ఓపెనర్ రాహుల్... బౌల్ట్ వేసిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.

ఇది కూడా చదవండి : అడ్డంగా బుక్ అయిన కృనాల్ పాండ్యా... అంతా నీ వల్లే అంటూ లక్నో ఫ్యాన్స్ ఫైర్..

కేఎల్ రాహుల్ డకౌట్ అవ్వడంతో షాక్ తిన్న అతియా శెట్టి... ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం రాహుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి లక్నో ఓటమికి పునాదులు వేశాడు. అయితే క్వింటన్ డికాక్, స్టొయినస్ పోరాడటంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. చివర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా... 11 పరుగులు మాత్రమే చేసిన లక్నో 3 పరుగులతో ఓటమిని చవిచూసింది.

First published:

Tags: IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals

ఉత్తమ కథలు