ఐపీఎల్ 2022(IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెలన్నర రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 12 మ్యాచ్ లు ఆడేశాయి. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు గ్రూప్ టేబుల్ లో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, సన్ రైజర్స్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత మెరుగు పర్చుకోవడానికి కోల్ కతా నైట్ రైడర్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)) 2022 సీజన్ లో సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) జట్టు పరిస్థితి విచిత్రంగా ఉంది. గెలుస్తే వరుస పెట్టి మ్యాచ్ లను గెలవడం లేదంటే వరుస పెట్టి ఓడటం ఇది ఈ సీజన్ లో హైదరాబాద్ పరిస్థితి. ఐపీఎల్ లో ఇప్పటివరకు హైదరాబాద్ ఆడిన 11 మ్యాచుల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచింది. గత నాలుగు మ్యాచుల్లో హైదరాబాద్ గెలుపు రూచి చూడలేదు. అటు కేకేఆర్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడితే అందులో ఐదు విజయాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో ముంబైపై భారీ విక్టరీ కొట్టి టచ్ లోకి వచ్చింది కేకేఆర్. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు కూడా ఇది చావోరేవో లాంటి మ్యాచ్.
సన్ రైజర్స్ హైదరాబాద్ లో కెప్టెన్ విలియమ్సన్ తో పాటు అభిషేక్ శర్మ మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆదిలోనే వికెట్ కోల్పోకుండా ఆడితే హైదరాబాద్ జట్టు అద్భుత విజయం సాధించడం పక్కా. అభిషేక్ శర్మ ఇప్పటికే 331 పరుగులతో టాప్ స్కోరర్ లలో ఒకడిగా ఉన్నాడు.
ఆ తర్వాత మార్కర్రమ్, నికోలాస్ పూరన్, రాహుల్ త్రిపాఠి కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే.. అనవసర సమయాల్లో వికెట్లు చేజార్చుకుని మ్యాచ్ లపై పట్టు కోల్పోతుంది. ఇక హైదరాబాద్ పేస్ బౌలింగ్ గత మూడు మ్యాచుల నుంచి బలహీనంగా మారింది. నటరాజన్ తిరిగి జట్టులోకి చేరకపోతే కష్టమే. భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ తో పాటు ఫజల్ హక్ ఫరూఖీలు సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. వాషింగ్టన్ సుందర్ జట్టులో చేరే అవకాశం ఉంది.
ఇది కూాడా చదవండి : చెన్నై సూపర్ కింగ్స్ పరువు తీసిన చిన్న తలా సురేశ్ రైనా.. అసలేం జరిగిందంటే?
మరోవైపు.. కేకేఆర్ కు ఈ మ్యాచుకు ముందే భారీ షాక్ తగిలింది. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరమయ్యాడు. అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ లు మంచి భాగస్వామ్యాన్ని అందించాల్సి ఉంది. ఈ ఇద్దరూ ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశపరుస్తున్నాడు. నితీష్ రాణా, రింకూ సింగ్ లు మంచి టచ్ లో ఉన్నారు. ఆండ్రీ రస్సెలు, సునీల్ నరైన్ లు క్షణాల్లో ఆట స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవారు. బౌలింగ్ లో ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తీ కీలకం కానున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ముఖాముఖి పోరులో కేకేఆర్ దే సంపూర్ణ ఆధిపత్యం. కోల్ కతా ఇప్పటివరకు 14 మ్యాచుల్లో నెగ్గగా.. మరో 8 మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ విజయం కేతనం ఎగురవేసింది.
తుది జట్లు అంచనా :
కోల్ కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్/ సామ్ బిల్లింగ్స్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తీ
సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఏడైన్ మార్కరమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Shreyas Iyer, Sunrisers Hyderabad