హోమ్ /వార్తలు /క్రీడలు /

KKR vs RR : సంజూ సామ్సన్ అర్ధ సెంచరీ చేసినా.. తక్కువ పరుగులే చేసిన రాజస్తాన్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

KKR vs RR : సంజూ సామ్సన్ అర్ధ సెంచరీ చేసినా.. తక్కువ పరుగులే చేసిన రాజస్తాన్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

సంజూ సామ్సన్ (PC : IPL)

సంజూ సామ్సన్ (PC : IPL)

KKR vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా సోమవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మెరుగైన స్కోరును సాధించింది. స్టార్ ఓపెనర్ బట్లర్ (22) నిరాశ పరిచినా.. ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన సంజూ సామ్సన్ (49 బంతుల్లో 54 ; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు.

ఇంకా చదవండి ...

KKR vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా సోమవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మెరుగైన స్కోరును సాధించింది. స్టార్ ఓపెనర్ బట్లర్ (22) నిరాశ పరిచినా.. ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన సంజూ సామ్సన్ (49 బంతుల్లో 54 ; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. పిచ్ స్లోగా ఉండటంతో పరుగులు సాధించడానికి రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. కేకేఆర్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివర్లో షిమ్రన్ హెట్ మైర్ (13 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. దాంతో రాజస్తాన్ పోరాడే టోటల్ ను కేకేఆర్ ముందు సెట్ చేయగలిగింది.  టిమ్ సౌతీ 2 వికెట్లు సాధించాడు.

ఇది కూడా చదవండి : ఏం తింటున్నావ్ సామీ.. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటీ.. రిటర్న్ క్యాచ్ తో మరోసారి కేక పెట్టించిన ఉమేశ్

బట్లర్ తడబాటు

సీజన్ లో తొలిసారి బట్లర్ తడబడ్డాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ అదరగొట్టిన అతడు ఈ మ్యాచ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ఆరంభంలో పెద్దగా పరుగులు చేయలేకపోయినా.. ఆ తర్వాత రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అయితే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం బట్లర్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. పిచ్ స్లోగా ఉండటం, బంతి ఆగి రావడంతో షాట్లు ఆడటంలో బ్యాటర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. అద్భుత రిటర్న్ క్యాచ్ కు పడిక్కల్ అవుటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన మిగిలిన బ్యాటర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దాంతో రాజస్తాన్ రాయల్స్ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. అయితే సామ్సన్, హెట్ మైర్ అడపాదడపా షాట్లు ఆడి జట్టుకు పోరాడే స్కోరును అయితే అందించగలిగారు.

తుది జట్లు

కోల్ కతా నైట్ రైడర్స్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, అంకుల్ రాయ్, బాబా ఇంద్రజిత్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, శివమ్ మావీ.

రాజస్తాన్ రాయల్స్

సంజూ సామ్సన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జాస్ బట్లర్, కరుణ్ నాయర్, హెట్ మైర్, పరాగ్, అశ్విన్, ప్రసిధ్, బౌల్ట్, కుల్దీప్ సేన్, చహల్

First published:

Tags: IPL, IPL 2022, Kolkata Knight Riders, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson, Shreyas Iyer

ఉత్తమ కథలు