హోమ్ /వార్తలు /క్రీడలు /

KKR vs RR : ఏం తింటున్నావ్ సామీ.. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటీ.. రిటర్న్ క్యాచ్ తో మరోసారి కేక పెట్టించిన ఉమేశ్

KKR vs RR : ఏం తింటున్నావ్ సామీ.. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటీ.. రిటర్న్ క్యాచ్ తో మరోసారి కేక పెట్టించిన ఉమేశ్

ఉమేశ్ యాదవ్ క్యాచ్ (PC : TWITTER)

ఉమేశ్ యాదవ్ క్యాచ్ (PC : TWITTER)

KKR vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) వెటరన్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ తో వికెట్లను రాబడుతూనే.. మరోవైపు సూపర్ క్యాచ్ లతో అదరగొడుతున్నాడు.

KKR vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) వెటరన్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ తో వికెట్లను రాబడుతూనే.. మరోవైపు సూపర్ క్యాచ్ లతో అదరగొడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ రిటర్న్ క్యాచ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బౌలింగ్ లో వేగాన్ని జనరేట్ చేయడానికి చాలా దూరం నుంచి పరుగెత్తుకుంటూ వస్తూ బౌలింగ్ చేస్తారు. దాంతో బాల్ వేసిన తర్వాత కూడా అలానే కాస్త ముందుకు వెళ్తారు. దాంతో రిటర్న్ క్యాచ్ అందుకోవడం ఎప్పుడూ కూడా అంత సులభంగా ఉండదు. కానీ, కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రిటర్న్ క్యాచ్ లతో రెచ్చిపోతున్నాడు.

ఇది కూడా చదవండి : క్యాచ్ అంటే ఇదిరా.. వైరల్ అవుతోన్న ఉమేశ్ యాదవ్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్ వీడియో

సోమవారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో సత్తా చాటాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ మూడో ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ లో స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ నేరుగా షాట్ ఆడగా.. సెకన్ కంటే తక్కువ సమయంలో తన వద్దకు వచ్చిన బంతిని రెండు ప్రయత్నాల్లో అందుకున్నాడు. తొలుత బంతి వెళ్లే మార్గానికి చేయిని అడ్డు పెట్టడంతో బాల్ గాాల్లోకి లేచింది. ఇక రెండో ప్రయత్నంలో ఉమేశ్ యాదవ్ క్యాచ్ ను పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొన్ని రోజుల మందు కూడా ఉమేశ్ యాదవ్ ఇదే రీతిలో ఒక అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన  ఆ మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొలి బంతికే పృథ్వీ షా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను డైవ్ చేస్తూ అందుకున్నాడు.


తుది జట్లు

కోల్ కతా నైట్ రైడర్స్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, అంకుల్ రాయ్, బాబా ఇంద్రజిత్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, శివమ్ మావీ.

రాజస్తాన్ రాయల్స్

సంజూ సామ్సన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జాస్ బట్లర్, కరుణ్ నాయర్, హెట్ మైర్, పరాగ్, అశ్విన్, ప్రసిధ్, బౌల్ట్, కుల్దీప్ సేన్, చహల్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kolkata Knight Riders, Prithvi shaw, Rajasthan Royals, Sanju Samson, Shreyas Iyer

ఉత్తమ కథలు