Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో థర్డ్ అంపైర్లు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదానికి కేంద్రంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా డీవై పాటిల్ వేదికగా సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. రోహిత్ శర్మ (Rohit Sharma) విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్తూ అతడి తొడ భాగాన్ని తాకి కీపర్ కు సమీపంగా వెళ్లింది. కేకేఆర్ కీపర్ షెల్డన్ జాక్సన్ తన కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ను పూర్తి చేశాడు.
ఇది కూడా చదవండి : వెల్ డన్ ముసలోడా..! సహచర ఆటగాడిని టీజ్ చేసిన ధోని.. స్టంప్ మైక్ లో రికార్డు
కేకేఆర్ ఆటగాళ్లు అవుటంటూ సంబరాలు చేసుకోగా.. అంపైర్ క్రిస్ గఫానీ అవుట్ ఇవ్వలేదు. దాంతో శ్రేయస్ అయ్యర్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి రోహిత్ బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అల్ట్రా ఎడ్జ్ లో చూసినప్పుడు బంతి బ్యాట్ కు దూరంగా ఉన్నా కూడా స్పైక్ కనిపించింది. ఇక బ్యాట్ కు సమీపంగా వచ్చినప్పుడు ఆ స్పైక్ మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ అవుటంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. బంతి బ్యాట్ కు చాలా దూరంగా ఉన్న సమయంలో కూడా అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ కనిపించడం వివాదాస్పదంగా మారింది. అయితే బంతి బ్యాట్ కు దగ్గరగా వచ్చినప్పుడు అల్ట్రా ఎడ్జ్ లో బిగ్ స్పైక్ కనిపించడంతో థర్డ్ అంపైర్ రోహిత్ ను అవుట్ గా ప్రకటించాడు. అయితే అతడి అభిమానులు మాత్రం అది నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
Out or Not-out? 🤔#RohitSharma #MumbaiIndians #MIvsKKR #IPL2022 pic.twitter.com/Gb0G20BAXc
— Wisden India (@WisdenIndia) May 9, 2022
This was not out 😟 There was a disturbance when ball was not near to the bat and that continued. This is very poor umpiring. Even 3rd umpires are goofing up. 😔 #KKRvMI #RohitSharma #Umpiring
— Nikhil Dhawan (@NikhilND95) May 9, 2022
How on earth is that OUT? Dreadful decision...! FUCK. How is that even conclusive to overturn?
Substandard DRS sh*t. Bring in Hotspot for IPL🤮#MIvsKKR #MIvKKR #RohitSharma𓃵
— Rakshitha💫 (@MarinaSyren) May 9, 2022
అంతకుముందు కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బుమ్రా తన చివరి రెండు ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోవడం విశేషం. కోల్ కతా బ్యాటర్స్ లో వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Jasprit Bumrah, Kieron pollard, Kolkata Knight Riders, Mumbai Indians, Pat cummins, Rohit sharma, Shreyas Iyer