హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - KKR vs MI : 15 బంతుల్లో 56 పరుగులు.. శివతాండవం ఆడిన కమిన్స్.. ముంబై హ్యాట్రిక్ ఓటమి..

IPL 2022 - KKR vs MI : 15 బంతుల్లో 56 పరుగులు.. శివతాండవం ఆడిన కమిన్స్.. ముంబై హ్యాట్రిక్ ఓటమి..

ప్యాట్ కమిన్స్ (IPL Twitter)

ప్యాట్ కమిన్స్ (IPL Twitter)

IPL 2022 - KKR vs MI : వాటే బ్యాటింగ్.. వాటే బ్యాటింగ్.. కమిన్స్ శివతాండవం ఆడాడు. అతని దెబ్బకు పుణెలో సిక్సర్ల వర్షం కురిసింది. ముంబై బౌలర్లకు చుక్కలు కన్పించాయ్.

  పుణె వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో కోల్ కతా సూపర్ విక్టరీ కొట్టింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ శివతాండవం చేశాడు. కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కమిన్స్.. ముంబై బౌలర్లకు చుక్కలు చూపాడు. దీంతో.. 162 పరుగుల టార్గెట్ కేవలం 16 వ ఓవర్లలోనే ఛేజ్ చేసింది కేకేఆర్. దీంతో, కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 56 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (41 బంతుల్లో 50 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. ఈ విక్టరీతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేసుకి చేరుకుంది. ముంబైకి ఇది హ్యాట్రిక్ ఓటమి. 162 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కోల్ కతా వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 పరుగులు చేసిన రహానే టైమల్ మిల్స్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టగా.. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(10) డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

  ఆ తర్వాత సామ్ బిల్లింగ్ కాసేపు బౌండరీలతో అలరించాడు. అయితే, సామ్‌ బిల్లింగ్స్‌(17) రూపంలో కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో బాసిల్‌ తంపికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 8 పరుగులు చేసిన నితీష్‌ రాణా మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో డేనియల్‌ సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  ఓ వైపు వికెట్లు పడుతున్నా.. వెంకటేశ్ అయ్యర్ మాత్రం తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. గత మ్యాచులో మెరుపులు మెరిపించిన ఆండ్రీ రస్సెల్ (5 బంతుల్లో 11 పరుగులు) టైమల్ మిల్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ విశ్వరూపం చూపించాడు.

  బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అంటూ బౌండరీలు, సిక్సర్లు వర్షం కురిపించాడు. ముఖ్యంగా డేనియల్ సామ్స్ వేసిన 16 వ ఓవర్ లో శివతాండవం ఆడాడు. 16 వ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు చేశాడు. దీంతో, 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 15 బంతుల్లో 56 పరుగులు చేశాడు ప్యాట్ కమిన్స్.

  అంతకు ముందు.. ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కష్టాల్లో ఉన్న ముంబైని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ గట్టెక్కించారు. ఈ ఇద్దరి జోరుకు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ( 36 బంతుల్లో 52 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (27 బంతుల్లో 38 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ ( 19 బంతుల్లో 29 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో పొలార్డ్ 5 బంతుల్లో 22 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమిన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఉమేశ్, వరుణ్ చక్రవర్తీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Pat cummins, Rohit sharma, Shreyas Iyer

  ఉత్తమ కథలు